https://oktelugu.com/

ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇకపై వర్క్ ఫ్రమ్ హోం లేదట..!

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ప్రపంచ దేశాల్లోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులందరితో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాయి. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ అయితే కంపెనీలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2020 / 08:09 PM IST
    Follow us on


    ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ప్రపంచ దేశాల్లోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులందరితో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    అయితే కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య్ తగ్గడం, పరిస్థితుల మార్పు వల్ల ఉద్యోగులు కంపెనీలకు రావాలని ఆదేశిస్తున్నాయి. పలు ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు వచ్చే నెల జులై వరకు వర్క్ ఫర్మ్ ఆప్షన్ ఇవ్వగా కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులకు ఖచ్చితంగా రావాల్సిందేనని చెబుతున్నాయి. ఉద్యోగులకు కంపెనీలకు రావాలని ఇప్పటికే ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త… ఏపీలో 575 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు..?

    కొందరు ఉద్యోగులు కంపెనీలకు వెళ్లడానికి అంగీకరిస్తుంటే మరి కొందరు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని కంపెనీలను కోరుతున్నాయి. ఆఫీసులలో కరోనా సోకకుండా కొన్ని కంపెనీలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా అమెరికా, భారత్ లో ఉన్నాయి. ఉద్యోగులు కంపెనీలకు రావడం వల్ల పని వేగంగా జరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.

    Also Read: స్కూల్ తెరిచిన రోజే విద్యార్థికి కరోనా పాజిటివ్.. చివరకు..?

    కొద్దికొద్దిగా ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కంపెనీలు ఉద్యోగులను కంపెనీలకు రమ్మని సూచిస్తున్నాయి.