Homeజాతీయ వార్తలుLalu Prasad Yadav: నాడు గడ్డి... నేడు భూములు.. జైలుకెళ్లినా లాలు కు బుద్ధి రాలేదు

Lalu Prasad Yadav: నాడు గడ్డి… నేడు భూములు.. జైలుకెళ్లినా లాలు కు బుద్ధి రాలేదు

Lalu Prasad Yadav
Lalu Prasad Yadav

Lalu Prasad Yadav: నాడు గడ్డి కుంభకోణం ఎంత చర్చకు దారి తీసిందో.. ఇప్పుడు బిహార్‌లో రైల్వేలో ఉద్యోగానికి ప్రతిఫలంగా భూమి స్కామ్‌ కూడా అంతే చర్చకు దారి తీస్తోంది. అధికారంలో ఉన్నప్డుడు అక్రమ సంపాదన కోసం నానా గడ్డీ కరిచిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌..తర్వావ రైల్వేలో ఉద్యోగానికి ప్రతిఫలంగా భూమిని కూడా వదల్లేదని స్పష్టమవుతోంది. ఇందులో తమ అస్మదీయులకు దోచి పెట్టేందుకు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దీనిపై ఉప్పందడంతో ఈడీ తవ్వడం మొదలు పెట్టింది. తవ్వుతున్న కొద్దీ దాన్ని కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకు వస్తున్నాయి.

రైల్వేలో ఉద్యోగానికి ప్రతిఫలంగా భూమి కలకలం సృష్టిస్తోంది. ఈ కుంభకోణం కేసులో భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వర్గాలు పేర్కొంటున్నాయి. రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంతో సంబంధమున్న ఈ లావాదేవీల ప్రస్తుత విలువ రూ.600 కోట్లు ఉంటుంది.. లాలూ మంత్రిగా ఉన్న 2004-09 మధ్య జరిగినట్లు పేర్కొంటున్న ఈ కుంభకోణంలో ఆయన కుటుంబం పట్నా, ఇతరచోట్ల ఖరీదైన ప్రాంతాల్లో పలు ఆస్తులను అక్రమంగా కూడబెట్టాయి.. ఇందులో రూ.350 కోట్ల స్థిరాస్తులు, రూ.250 కోట్ల నగదు లావాదేవీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన జాబితానూ విడుదల చేసి, విచారణ కొనసాగుతున్నట్లు తెలిపాయి. కాగా, నాడు లాలూ కుటుంబ బినామీలు పొందిన భూమి మార్కెట్‌ విలువ నేడు రూ.200 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ వర్గాలు వివరిస్తున్నాయి.

తనిఖీల్లో పలువురు బినామీదారులు, డొల్ల కంపెనీలు, లబ్ధి పొందినవారిని ఈడీ గుర్తించే పనిలో ఉంది. ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు చెందిన ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రూ.4 లక్షలకు కొనుగోలు చేసిన నాలుగు అంతస్తుల భవనం విలువ ప్రస్తుతం రూ.150 కోట్లు. కాగా, కుంభకోణంపై ఈడీ గత శుక్రవారం ఢిల్లీ, ముంబై, రాంచీ, పట్నాలోని 24 ప్రదేశాల్లో తనిఖీలు చేసింది. ఇందులో లెక్కలు చూపని రూ.కోటి నగదు, 1900 డాలర్లు, 540 గ్రాముల బంగారం, కిలోన్నర బంగారు నగలతో పాటు లాలూ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నది.

గ్రూప్‌ డి ఉద్యోగార్థుల నుంచి లాలూ కుటుంబ సభ్యులు నాలుగు స్థలాలను రూ.7.5 లక్షలకు కొన్నది. వీటిని లాలూ భార్య రబ్రీదేవి.. ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్‌ అబు దొజానాకు రూ.3.5 కోట్లకు విక్రయించారు. అనంతరం పెద్దమొత్తంలో నగదు తేజస్వీ ఖాతాలోకి వెళ్లింది లాలూ హయాంలో పలు రైల్వే జోన్లలో నియమితులైనవారిలో 50 శాతంపైగా మంది వారి కుటుంబ నియోజకవర్గాలకు చెందినవారే.. కాగా, ఈ కుంభకోణంలో శనివారం తేజస్వీ యాదవ్‌ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. గర్భిణి అయిన తన భార్య రేచల్‌ ఆస్పత్రిలో ఉండడమే దీనికి కారణమని ఆర్జేడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈడీ శుక్రవారం 12 గంటలు విచారించడంతో బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని చెప్పాయి. కాగా, తాము మళ్లీ పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందునే.. ఐదేళ్ల అనంతరం అకస్మాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని బిహార్‌ సీఎం నితీశ్‌ విమర్శించారు. 2017లో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్న సంగతిని ఆయన గుర్తుచేస్తున్నారు

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular