
#PAPA – Phalana Abbayi Phalana Ammayi Trailer : టాలీవుడ్ లో విభిన్నమైన అభిరుచి గల దర్శకులలో ఒకడు అవసరాల శ్రీనివాస్.ఈయన రచన నుండి వచ్చే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. నటుడిగా ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో దర్శకుడిగా కూడా అదే రేంజ్ పేరు ప్రాఖ్యాతలు సంపాదించాడు. ఈమధ్య కాలం లో ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టిన అవసరాల శ్రీనివాస్, చాలా కాలం తర్వాత ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా మరోసారి మన ముందుకుకి రాబోతున్నాడు. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగ శౌర్య ఆశలన్నీ ఈ సినిమా పైనే.
ఈ చిత్రం ఈ నెల 17 వ తారీఖున ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని నేడు విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి సంబంధించిన విశేషాలను ఇప్పుడు మనం చూడబోతున్నాము.
రెండు నిమిషాల 11 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ అవసరాల శ్రీనివాస్ మార్క్ కనిపించింది. కానీ ఆయన మార్క్ కామెడీ టైమింగ్ మాత్రం ఈ ట్రైలర్ లో మిస్ అయ్యినట్టు అనిపించింది. అవసరాల శ్రీనివాస్ హ్యూమర్ చాలా సహజం గా ఉంటుంది, కడుపుబ్బా నవ్వించేలా చేస్తుంది, సినిమాలో ఆయన మార్కు కామెడీ టైమింగ్ ఉంటుందేమో కానీ, ట్రైలర్ లో మాత్రం కేవలం హీరో, హీరోయిన్ మధ్య ఉండే లవ్ ట్రాక్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.వాళ్ళ మధ్య వచ్చే సంభాషణలు, బావోద్వేగాలను చాలా చక్కగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అన్ని తెలుస్తుంది.ఈ ప్రేమకథ మూడు దశల్లో ఉన్నట్టుగా అర్థం అవుతుంది.
తొలి దశలో మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తించడం, ఆ తర్వాత ఈగో లతో కొట్టుకోవడం, ఆ తర్వాత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ లాగ ప్రవర్తించడం వంటివి చూడొచ్చు.ఇందులో కథని కీలకమైన మలుపు తిప్పే పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించాడు. ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.