ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు ఎవరు సపోర్టుగా వచ్చినా.. ఎవరు కలిసొచ్చినా అక్కున చేర్చుకునేందుకే ఆరాటపడుతోంది ఎల్లో మీడియా. ఇన్ని రోజులు టీడీపీకి సపోర్టు నిలిచిన ఈ మీడియా.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను ఆయన పార్టీ జనసేనని ఆ మధ్యకాలమంతా విమర్శించిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు ఒక్కసారిగా స్టాండ్ మార్చుకుంది. ఏకంగా పవన్‌ను ఎత్తేస్తున్నాయి. ఆయన నిజాయతీపరుడు అంటూ కీర్తిస్తున్నాయి. గంటల తరబడి డిబేట్లు పెట్టి మరీ పవన్ టూర్ల మీద ఫోకస్ పెంచుతోంది.
Also Read: రామయ్యా.. రావయ్యా..: త్వరలోనే కేటీఆర్‌కు పట్టాభిషేకం!
రాజకీయాల్లోకి రాకముందే పవన్ కల్యాణ్ స్టార్ హీరో. పైగా మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. ఆయనకు ఇరు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. కామన్‌గా ఏ సభ పెట్టినా జనాలు, అభిమానులు వస్తుంటారు. అయితే.. దానిని కూడా జగన్‌కు యాంటీ అన్నట్లుగా చూపించేందుకు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది.
ఈ మధ్య చంద్రబాబు బావమరిది బాలక్రిష్ణ హిందూపురం టూర్ చేశారు. రోడ్ షోలు కూడా పెట్టారు. జగన్ సర్కార్ మీద పలు డైలాగ్‌లు పేల్చారు. వైసీపీ మంత్రులకు కూడా సీరియస్ వార్నింగులు ఇచ్చారు. కానీ.. ఆ విషయం పెద్దగా టీడీపీ అనుకూల మీడియాలో హైలైట్ కాలేదు. అదే సమయంలో గుడివాడలో పవన్ కల్యాణ్ మీటింగ్ నుంచి దివీస్ ఫ్యాక్టరీకి యాంటీగా పవన్ పెట్టిన సభల దాకా ఏ ఒక్కటీ వదలకుండా కవర్ చేస్తూ పూర్తిగా ఎత్తేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉన్నారు. అయితే.. ఇది సాంకేతికమేనని తమ్ముళ్లతో సహా అంతా భావిస్తున్నారు. పవన్ కి బీజేపీకి అసలు పొసగదు అని కూడా నమ్ముతున్నారు. పవన్ తన మానాన తాను సొంతంగా ఏపీలో టూర్లు వేస్తున్నారు. మాట వరుసకైనా ఎక్కడా బీజేపీ గురించి ఆయన ప్రస్థావించడంలేదు. పైగా పవన్ కల్యాణ్ సభల్లో జనసేన జెండాలు తప్ప బీజేపీ జాడ కూడా ఉండడం లేదు. దాంతో పవన్ దాదాపుగా ఒంటరిగానే రాజకీయ ప్రస్థానం చేస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా అంచనా వేసుకుంటోంది. ఆయన్ని ఎలాగైనా టీడీపీలో కలపాలన్నదే కొత్త వ్యూహంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ మీడియా కవరేజీ అనేది పలువురి వాదన.
Also Read: తొలిరోజే జోబైడెన్ సంచలన నిర్ణయాలివీ..
అపోజిషన్‌లో ఉన్న పవన్‌కు ప్రధాన శత్రువు అధికార పక్షం. అందుకే.. పవన్‌కు ఇలా పాజిటివ్ గా సిగ్నల్స్ పంపిస్తే ఇవాళ కాకపోయినా రేపయినా టీడీపీ వైపు చూస్తారని ఆ మీడియా భావిస్తోంది. ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీయే పొత్తులకు ఎత్తులకు పెద్దన్న అన్నది అనుకూల మీడియ భావన. దాంతో పవన్ కల్యాణ్ ని ప్రొజెక్ట్ చేస్తూ జనాల్లో జగన్ కి వ్యతిరేకత పెంచితే అంతిమంగా దాని లాభాలు, ఫలితాలు అన్నీ కూడా టీడీపీ ఖాతాలోకే వచ్చి చేరాలన్నదే ఎత్తుగడ. అందుకోసమే పవన్ కల్యాణ్ నిజాయతీపరుడని, ఎప్పటికైనా సీఎం కాగలవాడు అంటూ తెగ కీర్తిస్తున్నారు అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్