https://oktelugu.com/

అగ్రరాజ్యంలో కొత్త శకం ఆరంభం.. ముందు ఎన్నో సవాళ్లు

ట్రంప్‌.. నిన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్‌. ఆది నుంచి ఎంత వివాదస్పద లీడరో.. చివరి నిమిషంలోనూ అంతకంటే రెట్టింపు స్థాయిలో వివాదస్పదుడయ్యాడు. చివరకు ఆయనపై అభిశంసన పెట్టే వరకూ పరిస్థితులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటితో అమెరికాలో ఆయన శకం ముగిసింది. కొత్త పొద్దు పొడిచింది. జో బైడెన్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. Also Read: తొలిరోజే జోబైడెన్ సంచలన నిర్ణయాలివీ.. అమెరికాలో ఇప్పుడు చరిత్రాత్మక సభ కొలువుదీరింది. కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. చరిత్రలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2021 10:44 am
    Follow us on

    Joe Biden
    ట్రంప్‌.. నిన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్‌. ఆది నుంచి ఎంత వివాదస్పద లీడరో.. చివరి నిమిషంలోనూ అంతకంటే రెట్టింపు స్థాయిలో వివాదస్పదుడయ్యాడు. చివరకు ఆయనపై అభిశంసన పెట్టే వరకూ పరిస్థితులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటితో అమెరికాలో ఆయన శకం ముగిసింది. కొత్త పొద్దు పొడిచింది. జో బైడెన్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.

    Also Read: తొలిరోజే జోబైడెన్ సంచలన నిర్ణయాలివీ..

    అమెరికాలో ఇప్పుడు చరిత్రాత్మక సభ కొలువుదీరింది. కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వయోవృద్ధ ప్రెసిడెంట్‌ జో బైడెన్. అమెరికా శ్వేతసౌధంలోకి కొత్తగా లేడీ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌. వీరిద్దరి ప్రమాణ స్వీకారంతో ఇప్పుడు అమెరికాలో నూతన శకం మొదలైంది.

    అమెరికాకే తొలి ప్రాథమ్యం అని నినదిస్తూ 45వ దేశాధ్యక్షుడిగా చక్రం తిప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగేళ్ల పాలన.. అమెరికాను అక్షరాలా పెను సంక్షోభంలోకి నెట్టిందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 1861లో దేశం అంతర్యుద్ధంలోకి జారిపోతున్న వేళ అబ్రహాం లింకన్‌, 1933లో మహా మాంద్యం తాకిడికి అతలాకుతలమవుతున్న తరుణంలో ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ ఎదుర్కొన్న సవాళ్లతో సరిపోల్చవచ్చని అంటూనే అంతకంటే ఎక్కువ దుర్భిక్షం అనుభవించినట్లు అమెరికన్లు వాపోతున్నారు. ఇప్పుడు వాటి పర్యావసనాలను బైడెన్‌ ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

    దశాబ్దాల కాలంలో కొత్త యుద్ధలేవీ మొదలుపెట్టని మొదటి అధ్యక్షుడు తానే కావడం ఎంతో గర్వకారణమని ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా శాసనసభా సౌధం పైకి అనుయాయుల్ని దండెత్తించిన అధ్యక్షుడిగా అభిశంసనకు గురైన ట్రంప్‌.. వర్గ విద్వేషాలకు ఆజ్యం పోశారు. ఓటమి పాలైనా 7.4 కోట్లు సాధించి.. అతి మితవాద భావజాలంతో రిపబ్లికన్‌ పార్టీ మనుగడనే అనుశాసించిన ట్రంప్‌.. దుష్ప్రభావాలను తుడిచిపెట్టేయడం అంత ఈజీ కూడా కాదు. ట్రంప్‌లా అబద్ధాలతో దేశాన్ని పాలించిన వారు.. రాజ్యాంగ వ్యవస్థలనే నిర్వీర్యం చేసిన వారూ ఎవరు లేరు. ఎనిమిదేళ్లలో దేశాన్ని రుణ విముక్తం చేస్తానంటూ గద్దెనెక్కిన ఆయన.. నాలుగేళ్లలోనే అదనంగా 8.3 లక్షల కోట్ల డాలర్లు పాత పద్దుకు జోడించిన ఘనాపాటి.

    Also Read: అమెరికన్ల ఐక్యతే జోబైడెన్ మంత్రం..

    అయితే.. ఇప్పుడు ఇవి బైడెన్‌, కమలా హారీస్‌ లకు సవాల్‌గా మారబోతున్నాయి. మరోవైపు ఇప్పటికే రెండో ప్రపంచ యుద్ధం వలే దేశాన్ని చుట్టుముట్టిన కరోనాను దీటుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. తాము అధికారం చేపట్టాక వంద రోజుల్లోనే పది కోట్ల మందికి టీకాలందిస్తామని బైడెన్‌కు ఇప్పటికే హామీ ఇచ్చారు. అది ఆయనకు మహాయజ్ఞమే కానుంది. కోవిడ్‌ కారణంగా 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన నిరుద్యోగం.. మరింత పెరిగిపోయింది. మొన్న డిసెంబర్‌‌లో లక్షా 40వేల ఉద్యోగాలు ఊడిపోగా.. సామాజిక సంక్షోభం రాజ్యమేలుతోంది. అమెరికాలో ప్రస్తుతం లక్షలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నాయి. అద్దె చెల్లించలేని బతుకుల్లో ఉన్నారు. మూడో వంతు నిత్యావసరాల బిల్లులు సైతం చెల్లించలేకపోతున్నారని స్వయానా ఉపాధ్యక్షురాలు కమలా వెల్లడించారు. లక్షా 90 వేల కోట్ల డాలర్ల వ్యయ ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు బైడెన్‌ వ్యూహం సిద్ధం చేసినా.. రిపబ్లికన్ల చేయూత లభిస్తేనే అది సాధ్యపడేలా ఉంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు