https://oktelugu.com/

ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక దైర్యం వచ్చిందట !

అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘బంగారు బుల్లోడు’. గిరి పాలిక దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో పూజా జవేరి కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ నెల 23న ఈ చిత్రం విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. చాల రోజులు తరువాత అల్లరి నరేష్ నుండి ఫుల్ కామెడీ మూవీ వస్తోంది. కాగా ‘పరిపూర్ణ వినోదభరిత చిత్రమిది. మంచి సినిమాగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే విశ్వాసముంది’ అని […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 10:00 AM IST
    Follow us on


    అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘బంగారు బుల్లోడు’. గిరి పాలిక దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో పూజా జవేరి కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ నెల 23న ఈ చిత్రం విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. చాల రోజులు తరువాత అల్లరి నరేష్ నుండి ఫుల్ కామెడీ మూవీ వస్తోంది. కాగా ‘పరిపూర్ణ వినోదభరిత చిత్రమిది. మంచి సినిమాగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే విశ్వాసముంది’ అని అన్నారు అల్లరి నరేష్‌.

    Also Read: ప్రభాస్ పెళ్లి గురించి అడగగానే కృష్ణం రాజు సీరియస్

    అల్లరి నరేష్‌ ఇంకా మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లు పునఃప్రారంభమైనా గతంలో మాదిరిగా సినిమాలకు వసూళ్లు వస్తాయా ? రావా అని అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు సినిమాల్ని ఆదరిస్తారా? అనే కన్ఫ్యూజన్‌ ఉండేది. అయితే సంక్రాంతి చిత్రాల విజయంతో ఆ భయాలన్నీ తొలగిపోయాయి. దాంతో మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇక మా సినిమా విషయానికి వస్తే.. గ్రామీణ బ్యాంక్‌లో బంగారం తాకట్టు విభాగంలో పనిచేసే యువకుడి కథ ఇది’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్

    Also Read: చిరుకి చెల్లిగా నయనతార !

    అన్నట్టు బంగారం చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ సినిమాకి ‘బంగారు బుల్లోడు’ అని టైటిల్‌ పెట్టారట. ఇక ఈ సినిమా దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో కుటుంబ విలువలు, వినోదం కలబోతగా ఈ సినిమా సాగుతుంది. నరేష్‌ పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుంది’ అని అన్నారు. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందట. మరి చూడాలి అల్లరోడికి హిట్ వస్తోందేమో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్