
Yellow Media : ఏపీలో ‘పచ్చ’ మీడియా అంటే తెలియని వారుండరు. ఏది రాస్తే అదే జనాలు నమ్ముతారని భావిస్తుంటారు. ఆయా కథనాల్లో కొద్దోగొప్పో వాస్తవాలు ఉన్నా, 60 శాతం ఆరోపణలే ఉంటాయి. వాటిని చదివిన వారెవరికైనా రాష్ట్రం ఏమైపోతుందోనని ఆందోళనలకు గురవుతుంటారు. ఎవరినీ కావాలంటే వారిని అప్రతిష్టపాల్జేయడమే వాటి పని.
ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి ఒక్క చంద్రబాబు, లోకేష్ మినహా అందరూ దుర్మార్గులే. అది పవన్ అయినా, జగన్ అయిన ఒక్కటే. ప్రభుత్వంలో ఎవరుంటే వారిని తూర్పారపట్టడమే ఆంధ్రజ్యోతి పని. ఇందులో వస్తున్న కథనాలు కూడా నాలుగు రోజుల క్రితం వచ్చిన దానికి ఆ తరువాత వస్తున్న దానికి అసలు పొంతనే ఉండదు. పచ్చకామెర్లు వాచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట అలా ఉంటుంది దీని పరిస్థితి.
ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కథనమే ఇందుకు ఉదాహరణ. మూడు, నాలుగు రోజుల క్రితం పరిశ్రమలకు ప్రభుత్వం పన్ను రాయితీలు ఇవ్వడం లేదని, దీనివల్ల మూతపడే పరిస్థితి ఉందని రాశారు. 2020 నుంచి రాయితీలు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. కరోనా కారణంగా పరిశ్రమల పరిస్థితి దిగజారిపోయిందని వివరిస్తూ పేర్కొన్నారు. ఇది చదివిన ఎవరైనా నిజమే అనుకుంటారు. అంతలోనే నాలుగు రోజుల తరువాత తాజాగా ఇంకో కథనం రాశారు. ‘డీల్ గోల్ మాల్, అడ్డగోలుగా పన్ను రాయితీలు, కొన్ని పరిశ్రమలకు ఆయాచిత లబ్ధి’ అని. అంటే పరిశ్రమలను ప్రభుత్వం రాయితీలిచ్చి ఆదుకున్నట్లే కదా. ఇవ్వనప్పుడు ఇవ్వలేదని రాశారు… ఇస్తే ఇచ్చారని రాశారు. అది కూడా సూటిగా కాకుండా పచ్చ దండుకు అనుకూలంగా..
ఇలా ఉంటాయి ఆంధ్రజ్యోతి కథనాలు. ఇక మరో ప్రతిపక్షంగా బలంగా వస్తున్న పవన్ కల్యాణ్ ను ముందు అందలంగ ఎక్కించారు. ఆ తరువాత లోపలి పేజీలకు పరిమితం చేశారు. మరలా కావాలనుకంటే మొదటి పేజీకి తీసుకువస్తారు. తాము ఏది చెబితే అదే రాష్ట్రంలో జరగాలన్నది ఏబీఎన్ ఆర్కే భావనలా ఉంటుంది. ఈ ‘పచ్చ’దనం కారణంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయాచిత లబ్ధి పొందారనేది బహిరంగ రహస్యమే. చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన కథనాలు వండి వారుస్తూనే ఉంటారు. ‘పచ్చ’దనాన్ని విస్తరింపజేస్తుంటారు కాబోలు.