
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప చిత్రం 2021 వ సంవత్సరం లో విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.అన్ని భాషలకు కలిపి ఈ సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది.ముఖ్యంగా హిందీ లో అయితే ఈ చిత్రం కేవలం కోటి 75 లక్షల నెట్ వసూళ్లతో ప్రారంభమై 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించింది.
అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా.అలాంటి సంచలనాలు సృష్టించిన చిత్రానికి సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటాయి.అందుకు తగట్టు గానే ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట డైరెక్టర్ సుకుమార్.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి అప్పుడే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కోసం బయ్యర్లు ఎగబడుతున్నారట.ఒక ప్రముఖ సంస్థ ఈ సినిమాకి అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించి 1000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తామని పుష్ప మేకర్స్ కి ఆఫర్ ఇచ్చిందట.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటి వరకు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న సినిమాలు దంగల్, బాహుబలి 2 , KGF 2 ,#RRR మరియు పఠాన్.
ఈ చిత్రాలు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తేనే అబ్బో అని అనుకున్నారు అందరూ.కానీ పుష్ప చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గరే వెయ్యి కోట్ల రూపాయిల డిమాండ్ పలకడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.విడుదలకు ముందే ఇలాంటి క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్న పుష్ప 2 , విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.