CM Jagan
CM Jagan: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం మీడియా ప్రధాన లక్ష్యం. మీడియాలో వచ్చిన కథనాలకు, వాస్తవాలకు స్పందించి తప్పులను సరిదిద్దుకోవడం ప్రభుత్వం విధి. అయితే ఏపీలో ఆ పరిస్థితి ఉందంటే.. లేదనే సమాధానం వినిపిస్తోంది. పత్రికలు రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే కరపత్రికలుగా మారిపోయాయి. వైసీపీ లాంటి పార్టీకి సొంతంగా సాక్షి పత్రిక ఉంది. విపక్ష టిడిపికి మద్దతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి. ప్రభుత్వానికి మద్దతుగా సాక్షి పత్రిక రాసుకుంటుంది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది. ఇక తటస్థ మీడియా గా చెప్పుకునే ఒక సెక్షన్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియదు. అవసరాలను బట్టి అవి రంగులు మారుస్తుంటాయి. అందుకే ఏపీలో వార్తల్లో నిజం ఎంత అని తెలుసుకునేందుకు.. సగటు పాఠకుడు ఆపసోపాలు పడుతుంటాడు.
పొద్దున్న లేస్తే.. జగన్ తో పాటు వైసీపీ సర్కార్ పై ఆడిపోసుకునే ఎల్లో మీడియా ఇటీవల తీరు మార్చుకున్నట్టుంది. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందంటూ.. వదునైన మాటలతో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో గట్టి కథనాలే వస్తున్నాయి. అవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. నిఘవర్గాల సైతం ప్రభుత్వానికి దీనినే నివేదించడంతో జగన్ సర్కార్ జాగ్రత్త పడుతోంది. దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. గణాంకాలతో సహా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలను తన సాక్షి పత్రికలో ప్రచురిస్తోంది.
ఉద్యోగాల కల్పన విషయంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలను స్పందించిన ప్రభుత్వం యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. విశ్వవిద్యాలయాల్లో మొత్తం 3220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. 418 మంది ప్రొఫెసర్లు, 801 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్ ద్వారా మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.
అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముమ్మాటికి ఎల్లో మీడియా కథనాలు కారణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వంపై బురద జల్లే అంశం ఉన్నా.. నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జగన్ కళ్ళు తెరిపించిన ఘనత మాత్రం ముమ్మాటికీ రామోజీ, రాధాకృష్ణ కి దక్కుతుంది. మిగతా ఉద్యోగాల కల్పన విషయంలో సైతం జగన్ సర్కార్ మాట తప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా కథనాలు రాసి జగన్ కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత రాజ గురువు రామోజీ, ఆంధ్రజ్యోతి ఆర్కే లపై ఉందని చెబుతున్నారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట జగన్ను ఎల్లో మీడియా భయపెడుతూ తమ దారిలోకి తెచ్చుకుంటున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ తరుణంలోఆ రెండు పత్రికలు రాజకీయంగానే కాకుండా ప్రజల గురించి ఆలోచిస్తుండడం విశేషం. అయితే ఈ కథనాలు ప్రభుత్వంపై బురద జల్లే భాగమేనని.. ప్రజా వ్యతిరేకత వస్తుందని గ్రహించి పోస్టుల భర్తీకి జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Yellow media changed jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com