https://oktelugu.com/

YCP vs BJP: వైసీపీ వర్సెస్ బీజేపీ.. ఏపీలో మారుతున్న సమీకరణలు

YCP vs BJP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లు వైసీపీ గురించి పల్లెత్తు మాట అనని బీజేపీ ఇప్పుడు స్వరం పెంచింది. వైసీపీని నిందించేందుకు సిద్ధమైంది. రాయలసీమ సీఎంలతో రాష్ట్రం వెనుకబడిపోతోందని దుయ్యబట్టింది. బీజేపీ ఈ మేరకు జగన్ పై దుందుడుకు చర్యలకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ ఇక ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పరిణామాలతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 20, 2022 / 08:15 AM IST
    Follow us on

    YCP vs BJP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లు వైసీపీ గురించి పల్లెత్తు మాట అనని బీజేపీ ఇప్పుడు స్వరం పెంచింది. వైసీపీని నిందించేందుకు సిద్ధమైంది. రాయలసీమ సీఎంలతో రాష్ట్రం వెనుకబడిపోతోందని దుయ్యబట్టింది. బీజేపీ ఈ మేరకు జగన్ పై దుందుడుకు చర్యలకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ ఇక ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పరిణామాలతో రాజకీయ ముఖచిత్రం మొత్తం మారిపోతోందని తెలుస్తోంది.

    YCP vs BJP

    ఇన్నాళ్లు జగన్ అవసరం ఉందని భావించారో ఏమో కానీ జగన్ పై ప్రత్యక్షంగా ఆరోపణలు చేసేందుకు బీజేపీ ముందుకు రాలేదు. ఉత్తరప్రదేశ్ తో పాటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మోగించడంతో ఇక దూకుడు పెంచింది. ఏపీపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ విజయం కోసం అన్ని మార్గాలు వెతుకుతోంది. ఇందులో భాగంగానే వైసీపీని టార్గెట్ చేసుకుంటోంది. దానిపై ఆరోపణలు చేస్తూ పోరాటానికి దిగుతోంది. వైసీపీ విధానాలను ఎండగడుతూ బీజేపీ ముందుకు వెళ్లాలని చూస్తోంది.

    Also Read: జగన్ గాలిలో గెలిచావ్ ద్వారంపూడి.. పవన్ కళ్యాణ్ ను ఓడించే దమ్ముందా?

    ఈ నేపథ్యంలో రాయలసీమ రణభేరి పేరిట బహిరంగ సభ నిర్వహించి అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొని వైసీపీ పాలనను వ్యతిరేకించారు. రాయలసీమ ముఖ్యమంత్రులైనా ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులపాలైందని ఆరోపించారు. ఫలితంగా పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకుంటామని శపథం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీని అంతమొందించాలని కోరారు. బీజేపీ నేతల తీరుతో వైసీపీలో కూడా భయం పట్టుకుంది. ఇక పోరాటం ఉధృతం చేయాల్సిన సమయం వచ్చిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

    modi, jagan

    దీంతో ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైందని తెలుస్తోంది. బీజేపీ సభ నిర్వహణతో అన్ని పార్టీల్లో భయం సృష్టించింది. ఇక లాభం లేదనుకుని ప్రచార పర్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం బీజేపీనే పూరించింది. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ తమ పలుకుబడి ఉపయోగించుకుని లబ్ధిపొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో పరిస్థితులు ఒక్కసారిగా మారినట్లు విశ్లేషకుల చెబుతున్నారు.

    Also Read:  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు కానున్నాయా?

    Tags