https://oktelugu.com/

Holi: హోలీ వేడుకల్లో మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ కత్తితో ఇలా దారుణం.. వైరల్ వీడియో

Holi: జీవితాల్లో రంగులు నింపే ఈ హోలీ ఓ కుటుంబంలో మాత్రం విషాదాన్ని మిగిల్చింది. హోలీ నాడు రంగులు పూసుకొని మద్యం తాగి ఎంజాయ్ చేస్తున్న కుర్రాళ్లంతా ఈ సంఘటనతో హతాషులయ్యారు. ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూనే కత్తితో తనకు తాను పాట స్టెప్పులకు పొడుచుకొని చనిపోయాడు.అత్యంత బాధకరమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని కుష్వహానగర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. హోలీ పండుగ వచ్చిందంటే చాలు రంగులు తనివితీరా పూసుకొని ఆ తర్వాత […]

Written By: , Updated On : March 19, 2022 / 09:55 PM IST
Follow us on

Holi: జీవితాల్లో రంగులు నింపే ఈ హోలీ ఓ కుటుంబంలో మాత్రం విషాదాన్ని మిగిల్చింది. హోలీ నాడు రంగులు పూసుకొని మద్యం తాగి ఎంజాయ్ చేస్తున్న కుర్రాళ్లంతా ఈ సంఘటనతో హతాషులయ్యారు. ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూనే కత్తితో తనకు తాను పాట స్టెప్పులకు పొడుచుకొని చనిపోయాడు.అత్యంత బాధకరమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని కుష్వహానగర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది.

హోలీ పండుగ వచ్చిందంటే చాలు రంగులు తనివితీరా పూసుకొని ఆ తర్వాత మందు విందులతో జనాలు జల్సాలు చేశారు. ఈ క్రమంలోనే డీజేలు పట్టుకొని తనివితీరా డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకల్లో ఫుల్లుగా మద్యం తాగిన ఓ యువకుడు ఆ మత్తులో ఆ పాట స్టెప్పులకు కత్తితో అలానే పొడుకున్నాడు. తీరా చూస్తే రక్తం జలజలా కారిపోయింది. పక్కనున్న స్నేహితులు, కుటుంబ సభ్యులు గుర్తించే వరకూ అతడు గుర్తించలేకపోయాడు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మద్యం మత్తులో సినిమా స్టైల్లో స్టంట్ చేయబోయి ప్రాణాలు తీసుకున్న యువకుడి వీడియో వైరల్ అవుతోంది. హోలీ వేడుకల్లో 38 ఏళ్ల గోపాల్ సోలంకి స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తున్న గోపాల్ చేతిలో కత్తి పట్టుకొని ఖల్ నాయక్ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తూనే ఆ పాట స్టెప్పుకు లయబద్దంగా కత్తితో తనకు తానుగానే పొడుచుకున్నాడు.

ఈ వీడియో అక్కడ అమర్చిన సీసీ వీడియోలో రికార్డ్ అయ్యింది. గోపాల్ సోలంకి మద్యం తాగి ఆ మత్తులో పక్కనే స్నేహితులు ఉన్నా కత్తితో ఆ పాట ఊపులో పొడుచుకోవడం కనిపించింది. కత్తి గాటుకు గాయమై రక్తం కారుతున్నా గుర్తించలేకపోయాడు. అక్కడే ఉన్న మరో మహిళ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి చూడడంతో అందరూ షాక్ అయ్యారు.