https://oktelugu.com/

Age Relaxation: తెలంగాణలో వయోపరిమితి పెంపుతో ఉద్యోగాల కోసం పోటీ తీవ్రమైందా?

Age Relaxation: తెలంగాణ సర్కారు కొలువుల జాతర మొదలుపెట్టింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు నిరాశలో ఉన్న వారికి ఒక్కసారిగా గుడ్ న్యూస్ చెప్పడంతో ఇక వారి ఆనందానికి అవధులు లేవు. ఎలాగైనా సర్కారు కొలువు కొట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం కోచింగులు సైతం తీసుకుంటున్నారు. ఎలాగైనా పోటీ పరీక్షలో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇక ఆగేది లేదని చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొలువు సాధించడమే ప్రధాన ధ్యేయంగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 20, 2022 / 08:23 AM IST
    Follow us on

    Age Relaxation: తెలంగాణ సర్కారు కొలువుల జాతర మొదలుపెట్టింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు నిరాశలో ఉన్న వారికి ఒక్కసారిగా గుడ్ న్యూస్ చెప్పడంతో ఇక వారి ఆనందానికి అవధులు లేవు. ఎలాగైనా సర్కారు కొలువు కొట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం కోచింగులు సైతం తీసుకుంటున్నారు. ఎలాగైనా పోటీ పరీక్షలో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇక ఆగేది లేదని చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొలువు సాధించడమే ప్రధాన ధ్యేయంగా కదులుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

    Age Relaxation

    ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు కూడా వయోపరిమితి విషయంలో నిరుద్యోగులకు తీపి కబురే అందించింది. వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు ఎదురు చూసిన వారికి కూడా తమ వయసు ప్రభావం పడటం లేదు. దీంతో ఈసారి కొలువు కొట్టాల్సిందేనని తగ్గేదేలే అంటున్నారు. గరిష్ట వయో పరిమితి ఇదివరకు 34 ఏళ్లు ఉండగా దాన్ని తెలంగాణ సర్కారు 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

    Also Read:  జగన్ గాలిలో గెలిచావ్ ద్వారంపూడి.. పవన్ కళ్యాణ్ ను ఓడించే దమ్ముందా?

    అగ్నిమాపక, అటవీశాఖలకు మాత్రం వయోపరిమితి వర్తించదని తెలుస్తోంది. దీంతో ఆయా శాఖలకు మాత్రం 34 ఏళ్లుగానే వయో పరిమితి ఉండటం గమనార్హం. కానీ మిగతా శాఖలకు మాత్రం 44 ఏళ్లు నిబంధన ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఉద్యోగాల సాధనకు నిరుద్యోగులు కృషి చేస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలనే తపనతో ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 80 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉండటంతో ఏదో ఒక జాబ్ కొట్టాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు.

    KCR

    దాదాపు 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెబుతున్నారు. మూడు రోజుల్లో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. వయోపరిమితి పెంపుతో పోటీ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలనే ఉద్దేశంతోనే అందరిలో పోటీ భావం నెలకొందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మళ్లీ ఉద్యోగాల భర్తీ ఉంటుందో లేదో అనే సందేహంతో ఇప్పుడే జాబ్ సంపాదించుకోవాలని నిరుద్యోగ యువత కలలు కంటోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.

    Also Read: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు కానున్నాయా?

    Tags