Homeఆంధ్రప్రదేశ్‌YCP: ఆర్థిక కష్టాల్లో వైసీపీ సోషల్ మీడియా.. నిజమేనా?

YCP: ఆర్థిక కష్టాల్లో వైసీపీ సోషల్ మీడియా.. నిజమేనా?

YCP: సోషల్ మీడియా వచ్చాక.. రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలతో పనిలేదు. పార్టీ ప్రచార కార్యక్రమాలన్నీ సోషల్ మీడియా ద్వారా ఇట్టే పార్టీ శ్రేణులకు చేరిపోతుండడంతో.. అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వింగ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి సోషల్ మీడియా వింగ్ బలోపేతంగా ఉంది. దానికి ఇన్చార్జిగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి ఉన్నారు. రకరకాల ఎత్తుగడలతో భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ను నడుపుతున్నారు. అయితే ఇలా నడిపే క్రమంలో లోపాలు వెలుగు చూస్తుండడం విశేషం. సోషల్ మీడియాలో పనిచేస్తున్న చాలామందికి జీతాలు ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వింగ్ను మరింత బలోపేతం చేసింది. గతంలో వైసిపి కీలక నేత విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉండేవారు. కానీ ఆయన ను తప్పించిన జగన్… ఆ స్థానంలో సజ్జల భార్గవ్ రెడ్డిని కూర్చోబెట్టారు. దాని వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే భార్గవ్ రెడ్డి చేతుల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి మనసులను పక్కకు తప్పించారన్న టాక్ ఉంది. తన సొంత మనుషులతో నింపేశారని.. సోషల్ మీడియా మొత్తం తన గుప్పెట్లోకి లాక్కున్నారని.. తన ఇమేజ్ను బిల్డప్ చేసుకునేందుకు ఎక్కువ తాపత్రయ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించడం లేదన్న వార్త బయటకు వచ్చింది. అది కూడా శ్రీ రెడ్డి ద్వారా ఈ విషయం బయటపడింది. వాస్తవానికి సోషల్ మీడియా ప్రతినిధుల్లో స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేసే వారు ఐదు శాతం కూడా ఉండరు. 95 శాతం మందికి జీతాలు చెల్లిస్తున్నారు. అందుకోసం ఓ ప్రత్యేక యాప్ ను రూపొందించారు. అయితే కొంతమంది సెలబ్రిటీలను సైతం ప్రత్యేక ఖాతాలు తెరిపించి.. వారితో మాట్లాడిస్తుంటారు. కంటెంట్ మాత్రం వైసిపి కార్యాలయం నుంచి వెళ్తే.. వాటిని ఆ సెలబ్రిటీలు పోస్ట్ చేస్తారు. ఇలాంటి సెలబ్రిటీల్లో శ్రీ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇటీవల శ్రీ రెడ్డి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వండి జగనన్న అన్నదే ఈ పోస్ట్ సారాంశం. అందుకు ఆమెకు మద్దతు వెల్లువెత్తింది. వందలాదిమంది తనకు మద్దతు తెలిపినట్లు శ్రీరెడ్డి స్వయంగా ప్రకటించారు.

అక్కడ శ్రీరెడ్డి ప్రకటన చూస్తే తప్పకుండా జీతాలు గురించే అయి ఉంటుందన్న టాక్ ఉంది. అయితే ఆమెకు సజ్జల భార్గవ్ నుంచి ఆదేశాలు వచ్చాయా? లేకుంటే అనుకున్న ప్యాకేజ్ అందించారా? తెలియదు కానీ.. శ్రీ రెడ్డి మళ్ళీ పోస్టులకు రెచ్చిపోయారు. అయితే వైసీపీ సోషల్ మీడియా పనితీరుపై సొంత పార్టీలోనే భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ను, పార్టీని గుప్పెట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగానే… సోషల్ మీడియా వింగ్ను కుమారుడు భార్గవ్ రెడ్డి హైజాక్ చేస్తున్నారన్న టాక్ పార్టీలో నడుస్తోంది. అయితే అది రాజకీయ ప్రత్యర్థులో, పార్టీలో ప్రత్యర్థులో సృష్టించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అధికార బలమున్న సోషల్ మీడియా వింగ్ కు నిధుల కొరత ఏమిటన్న ఉత్పన్నమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular