https://oktelugu.com/

YCP MLA: జగన్ హత్యకు కుట్ర.. ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..!

YCP MLA: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండేన్నరేళ్ల సమయం ఉంది. అయినా కూడా ఇక్కడి రాజకీయాలు ఎల్లప్పుడు హీట్ పుట్టిస్తూనే ఉంటాయి. నిత్యం ఏదో వివాదంతో ఏపీ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో దూకుడుగా రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీని ఎదుర్కోలేక ప్రతిపక్ష టీడీపీ ఢిపెన్స్ లో పడిపోతుంది. ఇదే సమయంలో జనసేన, బీజేపీలు వైసీపీని గట్టిగా ఎదుర్కొంటూ ముందుకెళుతున్నాయి. ఏపీలో టీడీపీ బలంగా ఉన్న కొన్నిచోట్ల మాత్రం వైసీపీకి అంతోఇంతో పోటీనిస్తోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2021 / 02:29 PM IST
    Follow us on

    YCP MLA: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండేన్నరేళ్ల సమయం ఉంది. అయినా కూడా ఇక్కడి రాజకీయాలు ఎల్లప్పుడు హీట్ పుట్టిస్తూనే ఉంటాయి. నిత్యం ఏదో వివాదంతో ఏపీ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో దూకుడుగా రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీని ఎదుర్కోలేక ప్రతిపక్ష టీడీపీ ఢిపెన్స్ లో పడిపోతుంది. ఇదే సమయంలో జనసేన, బీజేపీలు వైసీపీని గట్టిగా ఎదుర్కొంటూ ముందుకెళుతున్నాయి.

    YCP and TDP

    ఏపీలో టీడీపీ బలంగా ఉన్న కొన్నిచోట్ల మాత్రం వైసీపీకి అంతోఇంతో పోటీనిస్తోంది. ఈక్రమంలోనే ఇరుపార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో కొంతకాలంగా ఏపీ రాజకీయాలు మాటలయుద్ధం నుంచి ప్రత్యక్ష దాడుల వరకు వెళ్లాయి. ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీకి చెందిన అనుచరులు దాడికి పాల్పడటం పరాకష్ఠకు చేరుకుంది.

    ఈ దాడిని సీఎం జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా సమర్ధించుకున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి.  ఇదిలా ఉంటే ఇటీవల కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలైంది. ఈనేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మళ్లీ వార్ షూర్ అయింది. ఈక్రమంలోనే అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్యపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

    మీడియా ముందుకొచ్చి చంద్రబాబు కన్నీటి పర్యాంతమయ్యాడు. ఈ ఇష్యూ కొద్దిరోజులపాటు ఏపీలో హీట్ ను పుట్టించింది. ఈక్రమంలోనే వల్లభనేని వంశీ ఓ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం కాస్తా చల్లారినట్లు కన్పించింది. అయితే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడిపై తాజాగా సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

    సీఎం జగన్మోహన్ రెడ్డి హత్యకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ ను చంపి టీడీపీ అధికారంలోకి చూస్తుందన్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు జగన్ గాల్లో కలిసిపోతారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

    ఇటీవల మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలను భౌతికంగా ఎదుర్కొనేందుకు రూ.50లక్షలు ఇస్తానని ఓ కమ్మ నేత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. టీడీపీ హింసా రాజకీయాలకు, స్కాములకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు.

    చంద్రబాబు హయాంలో వేలకోట్ల అవీనీతికి పాల్పడ్డారని, స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో రూ.242 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించాలని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్య ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్న నేపథ్యంలో టీడీపీ దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.