Chandrababu VS Jagan: కుప్పంలో చంద్రబాబును దెబ్బ తీయాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓడించినట్లే రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబును కుప్పంలో ఓడించాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇందుకు గాను కుల సంఘాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన పద్ధతులనే అవలంభిస్తూ బాబును బురిడీ కొట్టించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనికి పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కుప్పంలో విజయం కోసం మూడు సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుంటున్నారు. రెడ్డి, బ్రాహ్మణ, బీసీ వర్గాలను తమ దారికి తెచ్చుకోవాలని చూస్తన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధానం అనుసరించి బాబును ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా వారిని తమ వెంట ఉండేలా చేసుకుని మళ్లీ కుప్పంలో పాగా వేయాలని చూస్తోంది.
జగన్ ఈ మేరకు పలు కోణాల్లో వ్యూహాలు ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సామాజిక వర్గాలను సమతూకం చేస్తూ పక్కా ప్లాన్ ప్రకారం అమలు చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా బాబును కుప్పంలో విజయం సాధించకుండా చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి గాను ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కమ్మ వారిలో రగులుతోన్న అసంతృప్తి
చంద్రబాబు నాయుడును పూర్తిగా దెబ్బ తీసేందుకే వైసీపీ నేతలు సిద్ధమైనట్లు సమాచారం. బాబు సొంత నియోజకవర్గంలో పట్టు లేకుండా చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో బాబు ఇక రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చాన్స్ లేకుండా చేయాలని వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ఎదురు లేకుండా చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం దీని కోసమే పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: టీడీపీలో కట్టప్పలు.. బాబు గుర్తించాడా?