https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్​లో మల్లూ హీరోయిన్ల హడావిడి.. స్టార్​ హీరోల సరసన ఛాన్స్​

Tollywood: సినిమా కథ రెడీ అయ్యింది. హీరో కూడా దొరికెశాడు. ఇక హీరోయిన్​ ఎవరా అని ఆలోచిస్తుండగా.. డైరెక్టర్​కు సడన్​గా మైండ్​లో ఏదో తట్టి ఫోన్ చేశాడు. హలో మల్లు మేడమ్. మా సినిమాలో నటిస్తారా?.. ప్రస్తుతం టాలీవుడ్​లో మల్లు హీరోయన్ల హవానే నడుస్తోంది. వరుసగా స్టార్​ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ కెరీర్​లో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం. చిన్నప్పుడే సినిమాలో కనిపించి.. హీరోయిన్​గా మారి మలయాళం, తమిళ పరిశ్రమలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 02:18 PM IST
    Follow us on

    Tollywood: సినిమా కథ రెడీ అయ్యింది. హీరో కూడా దొరికెశాడు. ఇక హీరోయిన్​ ఎవరా అని ఆలోచిస్తుండగా.. డైరెక్టర్​కు సడన్​గా మైండ్​లో ఏదో తట్టి ఫోన్ చేశాడు. హలో మల్లు మేడమ్. మా సినిమాలో నటిస్తారా?.. ప్రస్తుతం టాలీవుడ్​లో మల్లు హీరోయన్ల హవానే నడుస్తోంది. వరుసగా స్టార్​ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ కెరీర్​లో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.

    చిన్నప్పుడే సినిమాలో కనిపించి.. హీరోయిన్​గా మారి మలయాళం, తమిళ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకున్నారు నజ్రియా నజీమ్​. నీరమ్​, రాజారాణి, బెంగళూరు డేస్​, ట్రాన్స్ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు నేచురల్​ స్టార్​ నాని నటించిన అంటే.. సుందరానికీతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఆమెభర్త ఫాహద్ ఫాజిిల్​ పుష్పలో తెలుగులో పరిచయం కానున్నారు.

    బుల్లితెరపై చక్రం తిప్పి.. వెండితెరపై ప్రస్తుతం ఫేమస్​ అవుతున్న నటి రజీషా విజయన్​. రామారావు ఆన్​ డ్యూటీతో తెలుగులో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. రవితేజ హీరోగా, శరత్​ మంజవ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. మరో మలయాళ నటి అనిఖా సురేంద్రన్​ కూడా విశ్వక్​ సేన్​ సరసన ఛాన్స్ కొట్టేసింది. విశ్వాసం, ఎన్నై అరిందాల్​, క్వీన్​ సిరీస్​లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్​గా మంచి గుర్తింపు పొందింది.

    మణిరతన దర్శకత్వం వహిస్తోన్న పీరియాడికల్ మల్టీస్టారర్​ సినిమా పొన్నియెన్ సెల్వన్​లో ఓ కీరోల్ కొట్టేసింది ఐశ్వర్యా లక్ష్మి. గాడ్సె ద్వారా తెలుగులో హీరోయిన్​గా పరిచయం కానున్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాను గోపి గణేశ్​ దర్శకత్వం వహించారు.

    మరోవైపు మ్యూజిక్​ ఆల్బమ్స్​తో ఫేమస్​గా నిలిచి హీరోయిన్​గా అవకాశాలు దక్కించుకున్న నటి సౌమ్యామీనన్​. మహేశ్​బాబు హీరోగా రానున్న సర్కారు వారి పాటలో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్లానాయక్​ సినిమాతో సంయుక్తా మీనన్​ టాలీవుడ్​కు హాయ్ చెెప్పనున్నారు. ఇందులో రానాకు జోడీగా కనిపించనుంది. దీంతో పాటు బింబిసారాలో కూడా కనిపించనున్నారు.