AP Minister Ambati Rambabu: సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధాలుంటాయి. సినిమా వాళ్లు రాజకీయాల్లో రాజకీయ నేతలు సినిమాల్లో నటించడం మామూలే. నటులు రాష్ట్రాలను ఏలిన చరిత్ర మనది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులుగా తమ సత్తా చాటి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తారలకు నాయకులకు మధ్య సంబంధాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఏనాడో బ్రహ్మంగారు కూడా చెప్పారు.ముఖానికి రంగేసుకునే వారు పాలకులవుతారన్నది ఇప్పుడు నిజమవుతోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కూడా సినిమా వాళ్లు ఎక్కువైపోయారు ఇప్పటికే పలువురు చిత్రసీమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాలు-రాజకీయాలను విడదీయలేకుండా ఉంది. రెండు రంగాలకు ఉన్న సంబంధం అలాంటిది మరి. సినిమాల్లో ముఖానికి రంగేసుకుని నటిస్తారు. రాజకీయాల్లో రంగులు అవసరం లేకుండానే జీవిస్తారు. అంతటి కళాకారులు కాబట్టే సినిమాలకు రాజకీయాలకు ఉన్న అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమైనది.. సినిమాల్లో చేసిన వారికి రాజకీయాల్లో పాపులారిటీ రావడానికి ఇదే కారణం.
Also Read: Munugode Polling History: మునుగోడు పోలింగ్ హిస్టరీ.. ఎవరెవరు ఎన్నిసార్లు గెలిచారో తెలుసా..!
అయితే ఇక్కడో కళాకారుడి గురించి మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న నేత అంబటి రాంబాబు. ప్రతిపక్షాలను నిద్ర పట్టనివ్వకుండా చేసే ఆయనకు మంత్రి పదవి వరించడం తెలిసిందే. ఆయన సినిమాల్లో కూడా నటించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నటించిన సినిమా పేరేంటి? దర్శకుడు ఎవరు? ఆయన ఎప్పుడు నటించారు అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. వాటికి సంబంధించిన విషయాలు మాత్రం ఎవరికి అంతుచిక్కడం లేదు. కాకపోతే ఆయన యుక్త వయసులో చాలా అందంగా ఓ అందమైన హీరోయిన్ పక్కన ఇసుక బీచ్ లో మాట్లాడే ఫొటో వెలుగులోకి రావడంతో వైరల్ అవుతోంది.

దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నాటి సినిమాగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రి కావడంతో ఆయనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ప్రచారం అవుతున్నాయి. దీంతో ఆయన నటించిన సినిమా పేరేంటో మాత్రం బయటపడడం లేదు. ఇప్పటికే మంత్రివర్గంలో రోజా కూడా ఉండటంతో సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణించడం తెలిసిందే. వైసీపీలో అలీ, పోసాని వంటి వారు పనిచేస్తుండటంతో సినిమాకు రాజకీయాలకు సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read:KCR- AP TDP Leaders: ఏపీ టీడీపీ నేతలపై కేసీఆర్ ఫోకస్.. జాబితాలో ఉన్నదెవరు?
[…] Also Read: AP Minister Ambati Rambabu: సినిమాల్లో నటించిన వైసీపీ … […]