Bigg Boss 6- Sudigali Sudheer: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్లో ఉంటోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్లు బంపర్ హిట్ కొట్టడంతో.. ఐదో సీజన్ పై హైప్ నెలకొంది.. సెప్టెంబర్ 5న ప్రారంభమైన ఈ షో ఈసారి కాస్త డల్ అయిపోయింది. ఎవరూ యాక్టివ్ గా లేకపోవడం.. గొడవలకు ఆస్కారం లేకుండా చప్పగా సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. నాగార్జున కంటెస్టెంట్లను తిట్టినా.. ఆడని వారిని ఎలిమినేట్ చేసినా హౌస్ లో పరిస్తితి మారడం లేదు. అస్సలు జోష్ లేకుండా పోతోంది.

ఈ సీజన్లో కంటిస్టెంట్ల విషయంలో విమర్శలు వచ్చాయి. షో తొలి రోజున.. వీళ్లంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఈ సీజన్లో కొద్దిమంది మినహా.. మిగిలిన వారంతా షోకు వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యారు. సినిమా, టీవీ, న్యూస్, సోషల్ మీడియా.. ఇలా అన్ని కేటగిరీల్లో ఫేమస్ అయిన వారిని తీసుకున్నారు. అయితే అందరి ఆటతీరు ఏమాత్రం రక్తి కట్టడం లేదు. ఎంత లేపుదామనుకుంటున్నా షో లేవడం లేదు. అందుకే ఇక లాభం లేదనుకొని జబర్ధస్త్ మానేసి మరీ స్టార్ మా టీవీలోకి వచ్చిన సుడిగాలి సుధీర్ ను భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ హౌస్ లోకి దించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Adipurush Graphics: షాకింగ్..ఆదిపురుష్ సినిమాకి గ్రాఫిక్స్ డిజైన్ చేయించింది ఆ స్టార్ హీరోనా..?
లేటుగా, లేటెస్టుగా లిస్టులోకి వచ్చిన పేరు సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. ఈ జబర్దస్త్ కమెడియన్ ను కూడా ఐదో సీజన్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకుంటున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇతన్ని తీసుకోవడమే కాదు.. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్. తెలుగు బుల్లితెరలో ఏ షోలో చూసినా సుధీర్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఇతడికి ఉన్న డిమాండ్ దృష్ట్యా భారీ మొత్తం ఆఫర్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ షోలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కోటి రూపాయలు మాత్రమే. అది కూడా శ్రీముఖి మాత్రమే అందుకుంది. అయితే.. ఇప్పుడు సుధీర్ కు ఏకంగా 4.50 కోట్లు అందుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఇంత మొత్తం ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలోనే ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ సీజన్ ను లేపడం కోసం సుధీర్ కు అంతమొత్తం ఇచ్చి మరీ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని తెలిసింది. మరి, ఇందులో వాస్తవం ఎంత? అసలు సుధీర్ పార్టిసిపేట్ చేస్తున్నాడా? లేదా? అన్నది చూడాలి.
Also Read:Prabhas- Om Raut: రూమ్ లోకి పిలిచి ఆదిపురుష్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్… వీడియో వైరల్
[…] […]