Duggirala MPP Election: వైసీపీ తన మార్కు రాజకీయం చూపించింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి నియోజకవర్గంలో పట్టు సడలకూడదన్న అధిష్టానం నిర్ణయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చేసి చూపించారు. విపక్షానికి స్పష్టమైన మెజార్టీ ఉన్నా దుగ్గిరాల మండల ఎంపీపీ పదవిని వైసీపీ దక్కించుకునేలా చేశారు. సామ, వేద, దాన దండోపాయాలను ప్రయోగించి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
ఎంపీపీగా వైసీపీ ఎంపీటీసీ రూపవాణి ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ మార్కు రాజకీయం కనిపించింది. ఇక్కడ టీడీపీ, జనసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నా కేవలం అయిదుగురు సభ్యులతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడంలో ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. కేవలం అధికార దుర్వినియోగం చేసి ఎన్నికలు జరిపించారు.
Also Read: Ganta Srinivasa Rao: గంటా మళ్లీ యాక్టివ్.. మాజీ మంత్రి తీరుపై తెలుగు తమ్ముళ్ల గుస్సా
వాస్తవానికి దుగ్గిరాల ఎంపీపీ బీసీలకు రిజర్వ్ అయింది. టీడీపీ, జనసేన తరపున ఉన్న ఒకే ఒక్క బీసీ ఎంపీటీసీకి .. కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. కింది స్థాయి అధికారులు ఆమె బీసీ కాదనిఇచ్చిన నివేదికనే కలెక్టర్ కూడా సమర్థించడంతో షేక్ జబీన్ అనే ఆ ముస్లిం ఎంపీటీసీ ఎంపీపీ కాలేకపోయారు. రూపవాణికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆమె ఒక్కరే ఎంపీపీ పదవికి నామినేషన్ వేశారు.దీంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
వైసీపీ తొండాట
దుగ్గిరాల మండలంలో మొత్తం 18 మంది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను టీడీపీ, ఒక ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. మిగిలిన ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకే వైసీపీ పరిమితమైంది. విపక్ష కూటమితో పోల్చుకుంటే అధికార పక్షానికి రెండు ఎంపీటీసీ స్థానాలు తక్కువగా వచ్చినా వైసీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆసాంతం ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి తన మార్కు రాజకీయాన్ని చూపించారు. టీడీపీ, జనసేన నుంచి పది మంది ఎంపీటీసీలు హాజరైనా.. వైసీపీ నుంచి మాత్రం ఐదుగురే హాజరయ్యారు. రూపవాణికి ఎంపీపీ పదవి ఇస్తే ఇండిపెండెంట్‌గా నిలబడతారన్న అనుమానంతో ఇతర బీసీ ఎంపీటీసీల్ని ఎన్నికకు రానివ్వలేదు. టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరిగిన పద్మావతి అనే ఎంపీటీసీని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేశారని ఆమెకుమారుడు ఆరోపణలు చేశారు. డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. కానీ అధికార దర్పం ముందు ఆ ఫిర్యాదులు పనిచేయలేదు. ఆర్కే ఎంపీపీ ఎన్నికకు కూడా ఆమెను తీసుకు రాలేదు. పద్మావతితో పాటు మరో ఇద్దర్ని అదే విధంగా నిర్బంధంలో ఉంచి… మిగిలిన ఐదుగురితో ఎన్నికకు వచ్చినట్లుాగ తెలు్స్తోంది. టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడంతో ఆ కూటమి తరపున ఎవరికీ ఎంపీపీ స్థానం దక్కదనితేలిపోయింది. అయితే వైస్ ఎంపీపీలురెండు, కో ఆప్షన్ సభ్యుడి పదవులు అన్నీ టీడీపీ, జనసేన కూటమికే దక్కాయి.
Also Read:Revanth Reddy: రాహుల్ గాంధీ కోసం రేవంత్ తొక్కని గడపలేదు! అడగని వారులేరు!