Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాబోయే ఎన్నికలను లెక్కలోకి తీసుకుని పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కుల సంఘాలను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నాయి. గతంలో జరిగిన గొడవలకు నిదర్శనంగా నమోదైన కేసులను మాఫీ చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న పలు కేసులను ఎత్తివేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం కాపు ఓట్ల కోసమే ఇదంతా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అప్పట్లో కాపు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దీంతో తమ హక్కుల కోసం సమావేశమైన నేతలు ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా రైలునే తగలబెట్టారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం అయింది. దీంతో చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. అప్పటి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. గొడవకు కారణమైన వారిపై కేసులు పెట్టింది. కానీ ఇప్పటి ప్రభుత్వం వాటిని రద్దు చేసి వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
కాపులకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు నిరసన చేపట్టారు. రాజకీయంగా కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. దీంతో ప్రభుత్వం వారిని కట్టడి చేయలేకపోయింది. అప్పట్లో ఈ ఘటన అత్యంత గొడవలకు కేంద్ర బిందువు అయింది.
Also Read: ఉద్యో గ సంఘాలను ప్రభుత్వం అడ్డుకుంటుందా? చలో విజయవాడను భగ్నం చేస్తుందా?
ప్రస్తుత పరిణామాల్లో వారిపై కేసులు మాఫీ చేయడమంటే వారిని తమ పార్టీ వైపు తిప్పుకోవడమే. దీంతో టీడీపీలో భయం పట్టుకుంది. కాపుల ఓట్లకు గాలం వేసిన వైసీపీ తీరుతో టీడీపీ ఆందోళన చెందుతోంది. రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లు తమకు దక్కవేమోననే బెంగ టీడీపీలో పట్టుకుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
వైసీపీ ప్రభుత్వం కావాలనే కాపులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలోనే ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీసినట్లు భావిస్తున్నారు. దీని కోసమే వైసీపీ వారిని మచ్చిక చేసుకుంటోంది. వారిపై ఉన్న కేసులన్ని మాఫీ చేయించి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
Also Read: కేంద్రంపై జగన్ వైఖరి మార్చుకోవాల్సిందే.. ఆ విషయాలపై ప్రశ్నించకుంటే కష్టమే..!