DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటిస్తోంది. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది.

కాగా మంచి వ్యూస్ తో లైక్స్ అండ్ షేర్లతో ఈ ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ లో డీజే గొప్పతనం గురించి చెబుతూ స్టార్ట్ అయిన ట్రైలర్ చివరి వరకు సందడిగా సాగింది. అలాగే, సిద్ధు, నేహాశెట్టి మధ్య రొమాంటిక్ సీన్స్ యువతను హుషారెత్తించేలా ఉన్నాయి. సిద్ధు లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ చాలా బాగుంది.
Also Read: ఉద్యో గ సంఘాలను ప్రభుత్వం అడ్డుకుంటుందా? చలో విజయవాడను భగ్నం చేస్తుందా?
అదేవిధంగా తమన్ నేపథ్య సంగీతం కూడా బాగా వర్కౌట్ అయింది. మొత్తమ్మీద ‘డీజే టిల్లు’ ట్రైలర్ హిట్ అయింది. సినిమా పై అంచనాలను పెంచేసింది. సినిమా కూడా ఆకట్టుకునే సన్నివేశంతో ప్రారంభమవుతుంది అని, ఆద్యంతం సందడిగా సాగుతుందని.. ట్రైలర్ లో మ్యాటర్ ఉన్నట్టే.. సినిమాలో కూడా ఫుల్ మ్యాటర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

మెయిన్ గా సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా చాలా బాగా నటించాడట. కాకపోతే.. అతని గెటప్ కొంచెం ఎబెట్టుగా అనిపించింది అనుకోండి. మొత్తానికి ఈ ‘డీజే టిల్లు’ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
