https://oktelugu.com/

నిమ్మగడ్డకు జై కొడుతున్న వైసీపీ నేతలు

నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని పట్టు పట్టినా.. వైసీపీ ప్రజా ప్రతినిధులు వద్దన్నా.. కోర్టు అనుమతితో ఎలాగోలా.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. వైసీపీ నాయకులు ఎంత భయపడ్డారో.. వారికి అంత అనుకూలమైన తీర్పును ప్రజలు ఇప్పటికే అందించారు. మొదటి రెండు విడతల్లో మెజారీటీ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మూడో విడతలోనూ వైసీపీ మద్దతుదారుల విజయం లాంఛనం కానుంది. Also Read: పెద్దిరెడ్డి గడ్డపై నిమ్మగడ్డ పర్యటన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ […]

Written By: , Updated On : February 14, 2021 / 11:52 AM IST
Nimmagadda
Follow us on

Nimmagadda
నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని పట్టు పట్టినా.. వైసీపీ ప్రజా ప్రతినిధులు వద్దన్నా.. కోర్టు అనుమతితో ఎలాగోలా.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. వైసీపీ నాయకులు ఎంత భయపడ్డారో.. వారికి అంత అనుకూలమైన తీర్పును ప్రజలు ఇప్పటికే అందించారు. మొదటి రెండు విడతల్లో మెజారీటీ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మూడో విడతలోనూ వైసీపీ మద్దతుదారుల విజయం లాంఛనం కానుంది.

Also Read: పెద్దిరెడ్డి గడ్డపై నిమ్మగడ్డ పర్యటన

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికల కోసం పట్టుపట్టకపోతే.. వైసీపీ నేతలు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతుండేవారు. ఎస్ఈసీ నిర్ణయంతో ఎన్నికలు పూర్తి అయ్యి.. వైసీపీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. పార్టీ కార్యర్తలు.. ఎమ్మెల్యేలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. పంచాయతీల్లో 80శాతంకు పైగా క్లీన్ స్వీప్ చేయడం వైసీపీ నేతల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. చాలా చోట్ల ఏకగ్రీవాలు కాగా.. వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే పోటీ నడిచింది. టీడీపీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించింది.

Also Read: మోడీని కలిసిన రఘురామ.. కారణం అదేనా?

మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీదే హవా కొనసాగింది. మొదటిదశ కన్నా రెండో విడతలో వైసీపీకి ఎక్కువ స్థానాలు లభించాయి. ఈ లెక్కన మూడోదశ క్లీన్ స్వీప్ ఖాయం అనిపిస్తోంది. ఓకరకంగా ఇదంతా.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చలవేననేది వైసీపీ నాయకుల అంతర్గత అభిప్రాయం. నిమ్మగడ్డ వల్లే ఎన్నికలు వచ్చాయి. నిమ్మగడ్డ వల్లే తమ ప్రతిభ బయటపడిందని వైసీపీ విజేతలు అంటున్నారు. పంచాయతీల్లోనే ఇలా ఉంటే.. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తామేంటో చూపిస్తామని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికార పార్టీకి వ్యతిరేకి. మిగిలిన ఎన్నికలు కూడా తన పదవీ కాలం పూర్తయ్యేలోపు నిర్వహించాలని అనుకుంటున్నారు. అటు ప్రభుత్వం సైతం మొండి పట్టుదలకు పోకుండా అంతా ఒకేసారి ముగించేలా ఆలోచన చేస్తోంది. ఈ లెక్కన మరో నెలరోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల సందడి ఉంటుందన్న మాట. మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరులోనూ వైసీపీ విజయానికి ఎవరూ అడ్డు ఉండరనేది అర్థం అవుతోంది. దీనంతటికి కారణం అని భావిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను వైసీపీ శ్రేణులు అభినందిస్తున్నారు.