వైఎస్ షర్మిల టార్గెట్ వారేనా..?

పార్టీ పెట్టకముందే.. తెలంగాణలో వైఎస్ షర్మిల సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పక్కా ప్రణాళికతో పార్టీని బలోపేతం చేసేలా పథకం రచిస్తున్నారు. పార్టీ ప్రకటన కన్నా ముందే.. సన్నాహక సమావేశాలు పెడుతూ.. మిగితా పార్టీల వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులతో షర్మిల సమావేశాలు నిర్వహించారు. సమయానుకూలంగా జిల్లాల్లో పర్యటించాలని అనుకుంటున్నారు. తమతో కలిసివచ్చే వారికోసం ఇప్పటికే వల వేస్తున్న షర్మిల బృందం కొంతమంది ప్రముఖలపై కూడా కన్నేసింది. […]

Written By: Srinivas, Updated On : February 14, 2021 12:19 pm
Follow us on


పార్టీ పెట్టకముందే.. తెలంగాణలో వైఎస్ షర్మిల సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పక్కా ప్రణాళికతో పార్టీని బలోపేతం చేసేలా పథకం రచిస్తున్నారు. పార్టీ ప్రకటన కన్నా ముందే.. సన్నాహక సమావేశాలు పెడుతూ.. మిగితా పార్టీల వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులతో షర్మిల సమావేశాలు నిర్వహించారు. సమయానుకూలంగా జిల్లాల్లో పర్యటించాలని అనుకుంటున్నారు. తమతో కలిసివచ్చే వారికోసం ఇప్పటికే వల వేస్తున్న షర్మిల బృందం కొంతమంది ప్రముఖలపై కూడా కన్నేసింది.

Also Read: షర్మిల టూర్ కు ఎన్నికల బ్రేక్..?

తెలంగాణలోని వైఎస్ అభిమానులపై ఫోకస్ పెట్టిన షర్మిల టీం వెంట నడిచిన వారిని సంప్రదించే పనిలో నిమగ్నమైంది. తెలంగాణలో వైఎస్ కుటుంబానికి నమ్మకంగా పనిచేసిన వారిలో ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. నల్లగొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. వీరికి కూడా షర్మిల నుంచి ఫోన్ వెళ్లిందని సమాచారం. పొంగులేటి పార్టీ మారినా.. ఏపీ సీఎం జగన్ కు విధేయుడిగానే ఉన్నారు. షర్మిల విషయంలో సానుకూల దృక్పథంలోనే ఉంటారా..? అన్నది చూడాలి. గతంలో వైసీపీ నుంచే పొంగులేటి ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయనను టచ్ చేయడంలో తప్పులేదనే భావనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: టీఆర్‌‌ఎస్‌ మరోసారి ఆ సీటును వదులుకున్నట్లేనా..?

తెలంగాణ కాంగ్రెస్లో బలమైన నాయకుల్లో ఒకరిగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స సైతం గతంలో వైఎస్సార్ కు సన్నిహితంగా మెలిగిన వారే. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు వీరిద్దరిపైనే చర్చ జోరుగా సాగుతోంది. కోమటిరెడ్డి సోదరులతో షర్మిల మాట్లాడే.. ఉంటారని టాక్ వినిపిస్తోంది. గడిచిన కొంత కాలంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో సైలెంట్ అయ్యారు. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరిగింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీద సోదరులిద్దరు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ తెరపైకి రావడంతో నల్లగొండ బ్రదర్స్ చుట్టూ చర్చ ప్రారంభం అయ్యింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణలో షర్మిల రాజకీయం విజయవంతం అయ్యే పరిస్థితి ఉంటుందా..? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంటే.. ఎలా ఉంటుందని సన్నహితుల దగ్గర కామెంట్ చేశారట కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోటస్పాండ్ నుంచి వస్తున్న ఫోన్ కాల్ నేపథ్యంలో కొందరు ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారంట. వెంటనే ఏం చెప్పలేక పోతున్నారంట. అయినా సరే.. షర్మిల టీం మాత్రం.. అందరినీ టచ్ చేస్తూ.. వస్తోందంట..