కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో అసంతృప్తి..!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పోస్టులను అమ్ముకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వద్ద ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా విభజన వల్ల చాలా సమస్యలు వస్తాయని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఉన్న ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం, అరకు జిల్లాల పరిధిలోకి వెళ్లితే […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 10:07 am
Follow us on


ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పోస్టులను అమ్ముకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వద్ద ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా విభజన వల్ల చాలా సమస్యలు వస్తాయని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఉన్న ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం, అరకు జిల్లాల పరిధిలోకి వెళ్లితే జిల్లా వాసులకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాను విభజన నుంచి మినహాయించాలని సీఎంను కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటు శ్రీకాకుళం జిల్లాకు సమస్యలు తెస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో లెక్కకు మించిన సమస్యలు ఎదురురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను విభజించడం వల్ల అనేక చోట్ల భౌగోళికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఇదే పరిస్థితి ఉందని అక్కడి నాయకులు అంటున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రకాశం జిల్లా పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ఇవన్నీ బాపట్ల జిల్లా పరిధిలో ఉండాల్సి వస్తుంది. దీనివల్ల జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

కొత్త జిల్లాల ఏర్పాటును సీపీఐ స్వాగతించగా, మిగిలిన విపక్షాలు ఈ అంశంపై స్పందించలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కాకుండా భౌగోళిక స్వరూపం ఆధారంగా మొత్తం 26 జిల్లాలను టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించినా విభజనపై ముందుకు వెళ్ళలేదు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు. మరోవైపు జిల్లాలకు పేర్లు నిర్ణయించే విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటులో సీఎం కేసీఆర్ చాలా సమస్యలు ఎదుర్కొని కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి వైసీపీ నాయకులే వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులను సీఎం ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.