Pawan Kalyan- YCP: వైసీపీ పరాజయానికి.. ఘోర పరాజయానికి మధ్య తేడా పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతోందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ, అటు చిత్తూరు నుంచి అనంతపురం వరకూ పవనే డిసైడింగ్ ఫ్యాక్టరని సామాన్య జనం కూడా నమ్ముతున్నారు. టీడీపీతో జనసేన కలిస్తే ఒక ఫలితం, జనసేన ఒంటరిగా పోటీచేస్తే మరోలా ఫలితం వస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే జనసేన లేని ప్రభుత్వం ఏర్పాటు ఈసారి అసాధ్యమన్న నిర్ణయానికి మాత్రం వస్తున్నారు. అందుకు తగ్గట్టే జనసేనాని పవన్ అంటేనే వైసీపీ భయపడుతోంది. ఎంతలా అంటే మేము విశాఖలో ఈ నెల 15న గర్జన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మీరు రావద్దొనేదాకా.

ఇప్పటికే జనసేన జనవాణి కార్యక్రమం ఈ నెల 16న జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి పవన్ నేరుగా వినతులు స్వీకరించనున్నారు. నెల రోజుల కిందటే కార్యక్రమ షెడ్యూల్ వెలువడింది. జన సైనికులు ఏర్పాట్లు కూడా చేశారు. కార్యక్రమానికి గాను పవన్ ఈ నెల 15న విశాఖ రానున్నారు. అదే రోజుల వైసీపీ విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. పవన్ రాకతో కార్యక్రమం అట్టర్ ప్లాఫ్ అవుతుందని భావిస్తున్న వైసీపీ నాయకులు పవన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు కార్యక్రమం నిర్వహిస్తే పవన్ ఎందుకు రాకూడదన్న ప్రశ్నకు వైసీపీ నేతలు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. తమకార్యక్రమాన్నిప్లాఫ్ చేయడానికే పవన్ వస్తున్నారంటూ చిన్నపిల్లల చాక్లెట్ తగువు మాదిరిగా చెబుతున్నారు. అయితే ఇంతలా భయపడేవాళ్లు.. తమకు ఎదురులేదని ఎలా అనుకుంటున్నారు. పవన్ ను ఎదుర్కొని రాజకీయం ఎలా చేయాలనుకుంటున్నారో వారికే ఎరుక.
పవన్ కళ్యాణ్ కోసం జన సైనికులు, మెగా ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశముంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పిలుపునిచ్చిన కార్యక్రమం కావడంతో బలవంతపు బల సమీకరణకు వైసీపీ నేతలు దిగే చాన్స్ ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలేవీ సక్సెస్ కావడం లేదు. ప్రజలు ముఖం చాటేస్తున్నారు. దీంతో పవన్ పర్యటన సక్సెస్ అయి… విశాఖ గర్జన తేలిపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే పవన్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఇప్పటికే పవన్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. అమరావతి ఏకైక రాజధానికి మద్దతుగా జై కొట్టారు. అటు విశాఖ గర్జనకు వ్యతిరేకంగా వరుసగా పాతిక ట్విట్లుచేశారు. ఎందుకీ గర్జనల పేరిట వైసీపీ నేతలకు సంధించిన ప్రశ్నలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ట్విట్లతోనే ఇంతలా ప్రతాపం చూపితే.. నేరుగా పవన్ రంగంలోకి దిగితే తమకు చుక్కలు కనిపించడం ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పవన్ ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ పరాభావానికి.. ఘోర పరాభవానికి మధ్య పవన్ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.