Garikapati – Chiranjeevi: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు, చిరంజీవి మధ్య నెలకొన్న వివాదం రగులుతూనే ఉంది. దీంతో మెగా అభిమానులు గరికపాటిని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. భక్తులకు ప్రవచనాలు చెప్పాల్సిన స్థాయిలో ఉండి అనవసరంగా ఆగ్రహానికి గురికావడం ఆయనకు తగినది కాదని చెబుతున్నారు. గరికపాటి కోపంపై సామాజిక మాధ్యమాలే వేదికగా రెచ్చిపోతున్నారు. చిరంజీవి తమ్ముడు నాగబాబు సైతం గరికపాటిపై గరం అవుతున్నారు. అన్నయ్య విషయంలో గరికపాటి అంతలా ఆగ్రహానికి గురికావడం సముచితం కాదని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో వారి మధ్య రేగిన రగడ ఇప్పుడే చల్లారేలా కనిపించడం లేదు.

అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన మహిళలు చిరంజీవితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుంటే అక్కడే ప్రవచనాలు చెబుతున్న గరికపాటి నరసింహారావుకు ఆగ్రహం వచ్చింది. పలుమార్లు చిరంజీవి గార్లు మీరు ఫొటోలు తీసుకోవడం ఆపితే మా కార్యక్రమం సజావుగా సాగుతుందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో గరికపాటి చిరంజీవి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గొడవ పెరిగింది. అదృష్టం కొద్ది చిరంజీవి అధికారంలోకి రాలేదని గరికపాటి మాట్లాడటంతో మెగా అభిమానుల్లో ఆగ్రహం పెరిగింది.
చిరంజీవి తమ్ముడు నాగబాబు సైతం ఫైర్ అయ్యారు. గరికపాటి నరసింహారావు అంటే అందరికి అభిమానమే. ఆయన ప్రవచనాలు అందరికి ఇష్టమే. కానీ ఆయన చిరు విషయంలో మాట్లాడిన మాటలు సమంజసమైనవి కావని ట్వీట్ చేయడం వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో గరికపాటి క్షమాపణలు చెప్పినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. గరికపాటి చిరంజీవి విషయంలో మాట తూలడంపై నాగబాబు మరింత మండిపడుతున్నారు. దీంతో వీరి మధ్య ఇంకా అగాధం పెరుగుతూనే ఉంది. కానీ చల్లారడం మాత్రం లేదు.

మెగా అభిమానులు గరికపాటిని వదలడం లేదు. ఓపెన్ విత్ ఆర్కే షోలో గరికపాటి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గురించి వెటకారంగా మాట్లాడటంపై అందరిలో కోపం వస్తోంది. గరికపాటి లాంటి ఆధ్యాత్మిక వేత్త నోరు తూలడం సంచలనంగా మారింది. ఏదో పట్టరాని కోపంతో గరికపాటి చిరుపై చిందులు వేయడం గమనార్హం. ఈ క్రమంలో చిరు, గరికపాటి తతంగం ఎందాక వెళ్తుందో తెలియడం లేదు. కానీ గరికపాటిని మెగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చీల్చి చెండాడుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే స్టేజీపై ఈయన గారి అసహనం పొరపాటుగా జరిగినట్టు అని అస్సలు అనిపించట్లేదు. ఎప్పటినుంచో కడుపులో పేరుకుపోయిన ద్వేషంలా ఉంది ఈయనగారిది. pic.twitter.com/OuxEP5ZpOc
— Actual India (@ActualIndia) October 10, 2022