ఇంజినీరింగ్‌ కాలేజీలకు జగన్‌ సర్కార్‌‌ షాక్‌

ఏపీలోని ఇంజినీరింగ్‌ కాలేజీలకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది ఆ రాష్ట్ర సర్కార్‌‌. ఒకవిధంగా ఇది స్టూడెంట్లకు మేలు చేసే నిర్ణయమే అయినా.. ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి మాత్రం వ్యతిరేకత వినిపిస్తోంది. వర్సిటీ అఫిలియేషన్‌, ఎగ్జామ్స్‌ ఫీజు, ల్యాబ్‌, లైబ్రరీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, అకడమిక్‌ ఆడిట్‌, డెవల్‌పమెంట్‌, స్టాఫ్‌ ట్రైనింగ్‌, కో ఆర్డినేషన్‌ మీటింగ్‌, వర్సిటీ పబ్లికేషన్‌, ట్రైనింగ్‌- ప్లేస్‌మెంట్స్‌ తదితర కామన్‌ సర్వీసెస్‌ ఫీజులన్నీ ట్యూషన్‌ ఫీజులోనే కలిసి ఉంటాయని, అదనంగా విద్యార్థుల నుంచి వసూలు […]

Written By: Srinivas, Updated On : December 24, 2020 3:24 pm
Follow us on


ఏపీలోని ఇంజినీరింగ్‌ కాలేజీలకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది ఆ రాష్ట్ర సర్కార్‌‌. ఒకవిధంగా ఇది స్టూడెంట్లకు మేలు చేసే నిర్ణయమే అయినా.. ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి మాత్రం వ్యతిరేకత వినిపిస్తోంది. వర్సిటీ అఫిలియేషన్‌, ఎగ్జామ్స్‌ ఫీజు, ల్యాబ్‌, లైబ్రరీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, అకడమిక్‌ ఆడిట్‌, డెవల్‌పమెంట్‌, స్టాఫ్‌ ట్రైనింగ్‌, కో ఆర్డినేషన్‌ మీటింగ్‌, వర్సిటీ పబ్లికేషన్‌, ట్రైనింగ్‌- ప్లేస్‌మెంట్స్‌ తదితర కామన్‌ సర్వీసెస్‌ ఫీజులన్నీ ట్యూషన్‌ ఫీజులోనే కలిసి ఉంటాయని, అదనంగా విద్యార్థుల నుంచి వసూలు చేయరాదంటూ కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది.

Also Read: నెల్లూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

సర్కార్‌‌ నిర్ణయంతో పెద్ద కాలేజీలపై దాదాపు రూ.15 వేలు, చిన్న కాలేజీలపై రూ.8-9 వేల వరకు భారం పడనుంది. ఫీజుల ఫిక్సేషన్‌లో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రేక్షక పాత్ర వహించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆరు నెలలుగా కమిషన్‌ చేసిన కసరత్తు అంతా వృథా అయిందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. విద్యా ప్రమాణాలు, ప్రతిష్ట, మంచి, చెడు అన్న తేడాలు అధ్యయనం చేయకుండా 2019–-20 విద్యా సంవత్సరంలో ఫీజులను ఖరారు చేశారన్న ఆరోపణలు మూట గట్టుకున్న ప్రభుత్వం.. ఈసారైనా వాటిని చక్కదిద్దుకోకుండా, మళ్లీ పాత ఫీజులనే ఫిక్స్‌ చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: వైఎస్‌ జగన్మోహనపురంపై ప్రతిపక్షాల సెటైర్లు

అయితే.. ప్రభుత్వమే నేరుగా ఫీజులను నిర్ణయించేటప్పుడు ఇక కమిషన్‌ను ఏర్పాటు చేయడం ఎందుకన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. రెగ్యులేటరీ కమిషన్‌ కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహించడం వృథాయేనని అంటున్నారు. ఇందుకోసం కోర్సులను బట్టి ఒక్కో కాలేజీ నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు రూపేణా దాదాపు రూ.50 వేల వరకు వసూలు చేశారని, ఇప్పుడు వాటిని తిరిగి వెనక్కి ఇస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాగైతే ఇంజినీరింగ్‌ విద్యలో ప్రమాణాలు ఎలా పెరుగుతాయని అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్