తాడిపత్రిలో రణరంగం: జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి?

రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధికార వైసీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య దాడులు, ప్రతిదాడులతో తాడిపత్రి రణరంగమైంది. Also Read: ఇంజినీరింగ్‌ కాలేజీలకు జగన్‌ సర్కార్‌‌ షాక్‌ తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే,ఎంపీలైన జేసీ సోదరుల ఇంటిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరగణంతో దాడికి పాల్పడడం.. ప్రతిగా జేసీ వర్గీయులు కూడా ఎదురుదాడి చేయడంతో తాడిపత్రిలో యుద్ధ […]

Written By: NARESH, Updated On : December 24, 2020 5:10 pm
Follow us on

రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధికార వైసీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య దాడులు, ప్రతిదాడులతో తాడిపత్రి రణరంగమైంది.

Also Read: ఇంజినీరింగ్‌ కాలేజీలకు జగన్‌ సర్కార్‌‌ షాక్‌

తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే,ఎంపీలైన జేసీ సోదరుల ఇంటిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరగణంతో దాడికి పాల్పడడం.. ప్రతిగా జేసీ వర్గీయులు కూడా ఎదురుదాడి చేయడంతో తాడిపత్రిలో యుద్ధ వాతావరణం నెలకొంది.

వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ సోదరులకు అస్సలు పడడం లేదు. ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. పెద్దారెడ్డి తన అనుచరులతో జేసీ ఇంటిపై దాడి చేసినప్పుడు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.

Also Read: వైసీపీ పథకాలు అమలు చేయడం లేదని బ్యాంకుల ముందు చెత్త వేశారా?

ఈ గొడవకు కారణం.. సోషల్ మీడియాలో జేసీ కుటుంబానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని విమర్శిస్తున్నాడని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి అనచరులు వాహనాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. అక్కడే ఉన్న కిరణ్ పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు భారీగా రాళ్లదాడి చేసుకున్నాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురి తలలు పగిలాయి.

పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో పెద్దారెడ్డి కూర్చీని జేసీ అనుచరులు తగులబెట్టి హంగామా చేసినట్టు సమాచారం. ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించి కంట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్