వైసీపీ పథకాలు అమలు చేయడం లేదని బ్యాంకుల ముందు చెత్త వేశారా?

కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త కుప్పలు సంచలమయ్యాయి. ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ ల ఎదురుగా చెత్త కుప్పలు తీసుకొచ్చి పోశారు. దీంతో స్థానికులంతా ఏంటి ఈ ఉపద్రవం అని ఆరాతీశారు. ఏం జరిగిందని ఆరాతీశారు. Also Read: నెల్లూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు అయితే ఏంటని ఆరాతీస్తే.. బ్యాంకులపై కోపంతో పారిశుధ్య కార్మికులు.. పురపాలక కమిషనర్ ఇలా చేశారని తెలిసింది. వైసీపీ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు […]

Written By: NARESH, Updated On : December 24, 2020 5:11 pm
Follow us on

కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త కుప్పలు సంచలమయ్యాయి. ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ ల ఎదురుగా చెత్త కుప్పలు తీసుకొచ్చి పోశారు. దీంతో స్థానికులంతా ఏంటి ఈ ఉపద్రవం అని ఆరాతీశారు. ఏం జరిగిందని ఆరాతీశారు.

Also Read: నెల్లూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

అయితే ఏంటని ఆరాతీస్తే.. బ్యాంకులపై కోపంతో పారిశుధ్య కార్మికులు.. పురపాలక కమిషనర్ ఇలా చేశారని తెలిసింది. వైసీపీ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అందివ్వాలన్నా సదురు బ్యాంకులు సహకరించడం లేదని.. ప్రజలకు అందివ్వడం లేదని ఇలా చేసినట్టు తెలుస్తోంది.

ఉయ్యూరులోని బ్యాంకులు సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వడం లేదంటూ పారిశుధ్య కార్మికులతో బ్యాంకు గేట్ల ముందు చెత్త డంపింగ్ చేసి నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. అన్ని బ్యాంకు కార్యాలయాల ముందు లోపలికి వెళ్లనీయకుండా పారిశుధ్య కార్మికులు చెత్తను వేశారు.

Also Read: వైఎస్‌ జగన్మోహనపురంపై ప్రతిపక్షాల సెటైర్లు

అయితే దీనిపై ఉయ్యూరు పురపాలక కమిషనర్ స్పందించలేదు. ఇలా చెత్తను వెయ్యమని కమిషనరే చెప్పారని కార్మికులు చెబుతున్నట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. పట్టణంలోని అన్ని బ్యాంకు శాఖల ముందు ఉద్యోగులు లోపలికి వెళ్లకుండా కార్మికులు ఇలా చెత్త వేసి నిరసన తెలిపినట్టు తెలుస్తోంది. చెత్త వేయడానికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్