రాయ్ పూర్ లోని కరౌదా గ్రామానికి చెందిన మనీషా సింగ్ తన భర్త రామజన్మతో కలిసి నివాసం ఉంటోంది. శ్రావణమాసంలో నియమనిష్టలతో పూజలు చేస్తోంది. తమ ఇష్ట దైవాలను పూజిస్తోంది. చిన్న విషయాలను కూడా పెద్దగా చూసుకునే మహిళలు భర్త చెప్పిన మాట వినలేదని కోపం పెంచుకుంది. పండుగ పూట కావాలనే చికెన్ తినడంతో భార్య జీర్ణించుకోలేకపోయింది. తాను పూజలు చేస్తుంటే భర్త విచ్చలవిడిగా మాంసం తింటే ఎలా అని మథనపడింది. ఇక తన జన్మ వృథా అని భావించింది.
మాంసమంటే అందరికి ఇష్టమే. కనిపిస్తే చాలు తినేయాలని చూస్తారు. అదే ఆయన చేసిన తప్పు. భార్య వారిస్తున్నా వినకుండా నోరును అదుపులో పెట్టుకోలేక ఇష్టంగా మాంసం తిన్నాడు. అంతేసంగతి భార్య కళ్లలో ఉగ్ర రూపం చూశాడు. దైవత్వంతో తాను పూజలు చేస్తుంటే భర్త ప్రవర్తన ఇలా ఉండడంతో ఓర్వలేకపోయింది. తన జీవితం వృథా అని భావించి లోకంలో ఉండడం కుదరదనుకున్న ఆమె జీవితాన్నే చాలించింది.
భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో గమనించిన భర్త మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మంటలు ఆర్పి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయాలు ఎక్కువవడంతో చికిత్స పొందుతూ మనీషా సింగ్ మృతి చెందింది. దీంతో అందరు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నేపథ్యంలో మనీషా సింగ్ ప్రాణాలు తీసుకోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.