
సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్ కన్నుమూశారు. శ్రామివ్ ముక్తీ దళ్ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. తన భర్త, కార్యకర్త భారత్ పటాంకర్ తో కలిసి ఆమె శ్రామిక్ ముక్తీ దళ్ ను స్థాపించారు. బహుజన్ ఉద్యమంలో ఆమె తన స్వరాన్ని వినిపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్, ఐడియాలను ఆమె సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేశారు. అంబేద్కర్ స్టడీ కోసమే ఓంవేద్ తన జీవితాన్ని సమర్పించారు. గెయిల్ ఓంవేద్ వయసు 81 ఏళ్లు. సంగ్లీ జిల్లాలోని కేసేగావ్ గ్రామంలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు.