CM Jagan Appeal: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు కోదవలేదనే చెప్పొచ్చు. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. దీంతో అనేక సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయి. వీటిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యాదీవెన పథకం ఒక్కటి.
నవ్యాంధ్రలో అక్షరాస్యతను పెంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా అమలవుతున్న ఫీజు రియంబర్స్ మెంట్ పథకానికి మార్పులు చేర్పులు చేసి జగన్ సర్కారు విద్యాదీవనను తీసుకొచ్చింది. గతంలో ఫీజురింబర్స్ మెంట్ ను నేరుగా కళాశాలలకు చెల్లించేవారు. అయితే విద్యాదీవనలో మాత్రంలో ఆ ఫీజులను విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
ఈ పథకం ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ కొందరు తల్లిదండ్రులు విద్యార్థుల ఫీజులను కళాశాలలకు చెల్లించకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో కళాశాలలకు సక్రమంగా ఫీజులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ యాజమాన్యాలు మూకుమ్మడిగా హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వం కళాశాలలకే నేరుగా ఫీజులు చెల్లించాలని ఆదేశాలను ఇచ్చింది.
కోర్టు తీర్పుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ తుది తీర్పు పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం మూడో విడుత విద్యాదీవన ఫీజుల్నీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లులకు ఓ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం సదుద్దేశ్యంతో విద్యాదీవన పథకాన్ని తీసుకొచ్చిందని.. విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులను వారం పదిరోజుల్లోగా కళాశాలలకు చెల్లించాలని కోరారు. అయితే సీఎం జగన్ విజ్ఞప్తిని విద్యార్థుల తల్లులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కరోనా కష్టకాలంలో డబ్బులు చేతికి రావడంతో వారంతా వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని సమాచారం.
Also Read: జగన్ ను నడిపించేది వారేనట..
ఈ విషయాన్ని కళాశాలల యాజమాన్యాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించకుంటే ఏ విధంగానైనా ఫీజులు వసూలు చేసుకోవచ్చని గతంలోనే తీర్పును ఇచ్చింది. దీనిపై కళాశాలలు సైతం సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ నేరుగా రంగంలోకి తల్లులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
విద్యార్థులు తల్లులు మాత్రం సీఎం జగన్ మాటను సైతం వినకుంటే హైకోర్టు ఆదేశాలతో నేరుగా ప్రభుత్వమే ఫీజులు చెల్లించాల్సి వస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వానికి మధ్య సరైన అవగాహన కుదరకపోవడంతో విద్యాదీవన పథకం విషయంలో హైకోర్టు తుదితీర్పు ఎలా ఉంటుందనే మాత్రం ఆసక్తిని రేపుతోంది.
Also Read: జగన్ మామూళ్లు.. మరి చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడో ?