https://oktelugu.com/

Radhe Shyam: సిరివెన్నెల మృతికి సంతాపంగా “రాధే శ్యామ్” సాంగ్ రిలీజ్ వాయిదా…

Radhe Shyam: ప్రముఖ గీత రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యి వారి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇక ఇటీవలే ఆయన అంత్యక్రియలు సాంప్రదాయకంగా ముగిశాయి. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తుదిశ్వాస విడిచిన కారణంగా ఈరోజు విడుదల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 05:09 PM IST
    Follow us on

    Radhe Shyam: ప్రముఖ గీత రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యి వారి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇక ఇటీవలే ఆయన అంత్యక్రియలు సాంప్రదాయకంగా ముగిశాయి. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తుదిశ్వాస విడిచిన కారణంగా ఈరోజు విడుదల కావాల్సిన పలు సినిమా అప్డేట్ లను మూవీ మేకర్స్ వాయిదా వేస్తున్నారు.

    ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ట్రైలర్ ని వాయిదా వేసిన జక్కన్న కొత్త డేట్ ని త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. అలానే భీమ్లా నాయక్ సినిమా నుంచి రిలీజ్ కావల్సిన నాలుగవ సాంగ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు చిత్ర నిర్మాతలు. ఇక తాజాగా ‘రాధేశ్యామ్’ ఈరోజు 4 గంటలకు విడుదల కావాల్సిన ‘నగుమోము తారలే’ పాటను రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ డిసెంబర్ 2 ఉదయం 11 గంటలకు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. గతంలో అప్డేట్ ల విషయంలో ఆలస్యం అయితే ట్రోల్ చేసే అభిమానులు ప్రస్తుత పరిస్థితులను అర్దం చేసుకొని విడుదల వాయిదా వేసినందుకు అభినందిస్తున్నారు.