https://oktelugu.com/

ఆ జిల్లాలో టీడీపీ కనుమరుగు కానుందా?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో పదవుల పందేరం కొనసాగింది. అయితే ఆ జిల్లా నేతలంతా ప్రస్తుతం సైలంటవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్నూల్ జిల్లాలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న కర్నూలులో టీడీపీకి 2014 ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ సీట్లురాగా ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని పదవులు ఈ జిల్లా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 02:04 PM IST
    Follow us on


    టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో పదవుల పందేరం కొనసాగింది. అయితే ఆ జిల్లా నేతలంతా ప్రస్తుతం సైలంటవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్నూల్ జిల్లాలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న కర్నూలులో టీడీపీకి 2014 ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ సీట్లురాగా ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని పదవులు ఈ జిల్లా నేతలే దక్కాయి.

    Also Read: చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి..!

    చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీ చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీలోకి చేరిపోయారు. దీంతో ఈ జిల్లా నేతలకు మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు, మండలి చైర్మన్, కార్పేరేషన్ చైర్మన్ వంటి ఎన్నో పదవులు దక్కాయి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం కర్నూలులో టీడీపీ ఒకటంటే ఒక్కసీటు కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. వైసీపీ అధికారంలోకి రావడంతో నాడు అధికారం అనుభవించిన నేతలంతా సైలంటవడం చర్చనీయాంశంగా మారింది.

    ప్రజా సమస్యలపై పోరాడాల్సిన టీడీపీ నేతలంతా గప్ చుప్ అవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడప్పుడు టీడీపీ నేతల అరెస్టులపై హంగామా చేస్తున్న నేతలు ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్లకు పరిమితం అవుతున్నారు. నాడు అధికారం చేయించిన నేతలు నేడు కనీసం టీడీపీ క్యాంప్ ఆఫీస్ వైపే చూడటం లేదనే విమర్శలున్నాయి. ఇక పార్టీ పిలుపిస్తున్న నిరసన్లలో కార్యక్రమాలను సైతం ఈ నేతలు పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.

    Also Read: ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి

    అడుపదడుప కొన్ని సమస్యలపై మాజీ మంత్రి అఖిలప్రియ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల కర్నూలు స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలందక ఒకేరోజు 19మంది కరోనా రోగులు మృతిచెందారు. దీనిపై కూడా టీడీపీ నేతలు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. టీడీపీ నేతల వ్యవహరంపై బాబు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రజాక్షేత్రంలో ముందుండి పోరాడాల్సిన నేతలు సైలంటవడంతో టీడీపీ నేతలు వైసీపీతో లోపాయికారిగా మారిపోయారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

    ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి జంప్ అవుదామా? అన్నట్లు టీడీపీ నేతల తీరు ఉందని స్థానిక నేతలు అంటున్నారు. నేతలు ఇలానే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో టీడీపీ కర్నూలు జిల్లాలో కనుమరుగు అవడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు హల్చల్ చేసి.. అధికారం పోయాక అడ్రస్ లేకుండాపోయే నేతలతో టీడీపీ 2024 ఎన్నికల్లో ఏమేరకు నెగ్గుకు రాగలుగుతుందనేది వేచి చూడాల్సిందే..!