టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా..!

అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా అన్నచందంగా పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా ఎంట్రీ తర్వాత సీఎం కేసీఆర్ హవా క్రమంగా తగ్గుతున్నట్లు కన్పిస్తోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీలు దూకూడుగా వెళుతుండగా అంతేస్థాయిలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. Also Read: కేసీఆర్ పై కోదండరాం […]

Written By: Neelambaram, Updated On : July 27, 2020 12:49 pm
Follow us on


అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా అన్నచందంగా పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా ఎంట్రీ తర్వాత సీఎం కేసీఆర్ హవా క్రమంగా తగ్గుతున్నట్లు కన్పిస్తోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీలు దూకూడుగా వెళుతుండగా అంతేస్థాయిలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది.

Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగింది. సీఎం కేసీఆర్ కు ధీటైన నాయకుడు ప్రతిపక్షంలో ఎవరూ లేకపోవడంతో ఆయన మాటే నెగ్గింది. అయితే కరోనా తర్వాత పరిస్థితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతూ వస్తున్నాయి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం అవడంతో ప్రతిపక్షాలకు ఛాన్స్ దొరికింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. మరోవైపు కరోనా రోగులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతుండటంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇరుకున పడుతోంది.

హైదరాబాద్ నగరంలో కరోనా విజృంభిస్తున్న వేళలో సీఎం కేసీఆర్ కొన్నిరోజులు కన్పించకుండా పోయారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ హ్యాష్ ట్యాగులతో ట్రెండింగులోకి తీసుకొచ్చారు. దీంతో ఈ విషయంలో జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మళ్లీ హైదరాబాద్ కు వచ్చి కరోనాపై సమీక్షలు చేయాల్సి వచ్చింది. అయితే కేసీఆర్ ఎక్కడి వెళ్లారనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. మరోవైపు కరోనా విజృంభిస్తున్న వేళ సచివాలయం కూల్చివేత పనులు, కరోనా టెస్టులు చేయకపోవడంతో హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేయడంపై క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Also Read: మీడియాపై మోడీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారా?

టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాయకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను కొంతమేర కట్టడి చేయగలిగినా సోషల్ మీడియాను మాత్రం మేనేజ్ చేయలేకపోతుంది. టీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టిన దాఖలు కన్పించడం లేదు. దీంతో నెటిజన్లు సైతం టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే కేటీఆర్ సైతం నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ముళ్లు బలంగానే గుచ్చుకుంటుందని టాక్ విన్పిస్తుంది. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ఎలా కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే..!