ఏపీ ప్రభుత్వంపై దాడి చేయడానికి చంద్రబాబుకు దొరికిన కొత్త అస్త్రం మద్యం షాపుల వేళలు పొడిగించడం. సీఎం జగన్ తీసుకు వచ్చిన నూతన మద్యం పాలసీలో దుకాణాలు ఉదయం 11:00 నుండి సాయంత్రం 7:00 గంటలకు వరకు మాత్రమే తెరిచి ఉండేవి. మద్యం షాపులలో పనిచేసే ఉద్యోగులు నిర్ణీత సమయం తరువాత ఎంత బ్రతిమాలినా మద్యం అమ్మడం లేదు. దీనిపై మద్యం వినియోగదారుల్లో తీవ్ర అసహనం ఉంది. చాలా మంది రోజూవారి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారాలు తమ పనులు ముగించుకొని వచ్చే సమయానికి మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు రాత్రి 9:00 గంటల వరకు కొనసాగేలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
Also Read: గ్రౌండ్ లెవల్లో జీరో.. సోషల్ మీడియాలో హీరో..
ఈ అంశాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. ఐతే జగన్ మద్యం పాలసీని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు బ్యాచ్ కి ఉందా అని. టీడీపీ గవర్నమెంట్ లో మద్యం ఏస్థాయిలో ఏరులై పారిందో అందరికి తెలిసిందే. 24 గంటలు అందుబాటులో ఉండే మద్యం దుకాణాలలో ఎల్లవేళలా మద్యం దొరికేది. ప్రతి మద్యం షాపుకి అనధికార పర్మిట్ రూమ్ లు ఉండేవి. రోజంతా కూర్చొని మద్యం తాగి, జేబులో చిల్లర మొత్తం ఖర్చు చేసుకొనే సౌలభ్యం చంద్రబాబు ప్రభుత్వంలో చూశాము. ప్రతి 500 మీటర్లకు ఓ వైన్ షాప్, ప్రతి గ్రామంలో లెక్కకు మించిన బెల్టు షాపులు దర్శనం ఇచ్చేవి. మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టం అన్నట్లుగా బాబు పరిపాలనలో మద్యం విధానం సాగింది.
Also Read: విజయసాయిరెడ్డికి గంటా షాక్ ఇవ్వనున్నాడా?
నాటి బాబు ప్రభుత్వం కొనసాగించిన మద్యం విధానానికి, జగన్ మద్యం పాలసీకి అసలు ఎక్కడగా పొంతనలేదు. నిర్ణీత సమయం తరువాత ఎంత వెతికినా మద్యం దొరకని పరిస్థితి ఉంది. వైన్ షాప్ దగ్గర మద్యం సేవించడం నిషిద్ధం, ఆరు బయట కూడా మద్యం తాగే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సగానికిపైగా మద్యం షాపులు ఎత్తివేయడంతో పాటు, అమ్మకాలు బాగా తగ్గించారు. ఇక బాబు ప్రభుత్వంలో వలె కావలసినంత మద్యం కొనుగోలు చేయలేము. ఒక వ్యక్తికి కేవలం మూడు బాటిల్స్ మాత్రమే ఇస్తున్నారు. మద్యం విధానంలో ఉన్న లోపాలను సవరిస్తూ జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేయడం జరిగింది. విచ్చల విడిగా మందుకు ప్రజలను బానిసలను చేసిన బాబు బ్యాచ్, కేవలం మద్యం దుకాణాల సమయం పెంచిన నందుకు ఇంత రాద్దాంతం చేస్తుంటే ఆశర్యం వేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం…మద్యం ప్రియులు నాటి బాబు పాలన తలచుకొని ఈ సారి ఆయన్నే గెలిపించుకోవాలనుకుంటున్నారు. బాబు కొనసాగించిన మందుబాబుల స్వర్ణయుగాన్ని తలచుకుంటూ…వి మిస్ యూ బాబు అంటున్నారు.