https://oktelugu.com/

2021 ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా..?

వచ్చే 2021 సంవత్సరం రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతోందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఈ ఇయర్‌‌లోనే కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశ రాజకీయాల్లోనే మార్పులు చోటు చేసుకునే వీలున్న ఈ రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని పరిశీలించేందుకు సీనియర్ అధికారుల్ని పంపి.. నివేదికలు కోరింది. Also Read: ‘రైతుబంధు’ కోసం ఎదురుచూపులేనా? పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబెంగాల్‌తోపాటు.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2020 / 11:47 AM IST
    Follow us on


    వచ్చే 2021 సంవత్సరం రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతోందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఈ ఇయర్‌‌లోనే కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశ రాజకీయాల్లోనే మార్పులు చోటు చేసుకునే వీలున్న ఈ రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని పరిశీలించేందుకు సీనియర్ అధికారుల్ని పంపి.. నివేదికలు కోరింది.

    Also Read: ‘రైతుబంధు’ కోసం ఎదురుచూపులేనా?

    పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబెంగాల్‌తోపాటు.. దక్షిణాదిన కీలకమైన తమిళనాడు.. కేరళ రాష్ట్రాలతోపాటు.. పుదుచ్చేరిలతోపాటు ఈశాన్య అసోం అసెంబ్లీ గడువు ఏప్రిల్ జూన్ మధ్య ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు పెడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమబెంగాల్‌లో ఈసారి తన ఆధిక్యతను ప్రదర్శించి.. అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కమలనాథులకు అవకాశం ఇవ్వకూడదని దీదీ అదే స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.

    దక్షిణాదిన కీలక రాష్ట్రంగా చెప్పే తమిళనాడులోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏమంటే.. చాలా ఏళ్ల తర్వాత కరుణ.. జయలలిత లేని అసెంబ్లీ పోరును చూడనున్నాం. మరోవైపు బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయటం.. రజనీ.. కమల్‌లు అధికారాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా పావులు కదుపుతున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణలన్నింటినీ మార్చేయటమే కాదు..  భవిష్యత్తు రాజకీయాలు ఏ రీతిలో ఉండనున్నాయన్న విషయంపై స్పష్టత రానుంది.

    Also Read: మూడు రాజధానులు: జగన్‌కు మోడీ సాయం చేస్తున్నారా?

    కేరళ.. పుదుచ్చేరి.. అసోంలో ఎన్నికలు పోటాపోటీగా సాగినా.. వాటి ఫలితాలు పెద్ద ఆసక్తిని కలిగించే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం.. తన ప్రతినిధుల్ని పంపుతోంది. అక్కడి ఎన్నికలకు ఉన్న అవకాశాలు.. తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరా తీయనుంది. ఏమైనా.. వచ్చే ఏడాది మొదట్లోనే.. ఈ ఎన్నికల వేడి దేశాన్నిచుట్టేయనుందని చెప్పక తప్పదు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్