https://oktelugu.com/

కరోనా టెస్టులు ఇకపై తెలంగాణలోనూ కారుచౌకగా..!

కరోనా.. కరోనా.. కరోనా ఈ పేరు చెబితే ప్రపంచం భయపడిపోతోంది.కరోనా వైరస్ పై ప్రభుత్వాలు.. వైద్యులు.. సామాజిక వేత్తలు ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించడంతో ఇటీవలీ కాలంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. Also Read: ‘రైతుబంధు’ కోసం ఎదురుచూపులేనా? ప్రజలంతా భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం.. శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటివి చేస్తున్నారు. దీనికితోడు కరోనా టెస్టుల కోసం వినియోగించే వైద్య పరికరాలు ఇప్పుడు స్వదేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి. తొలినాళ్లతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 3:40 pm
    Follow us on

    COVID testకరోనా.. కరోనా.. కరోనా ఈ పేరు చెబితే ప్రపంచం భయపడిపోతోంది.కరోనా వైరస్ పై ప్రభుత్వాలు.. వైద్యులు.. సామాజిక వేత్తలు ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించడంతో ఇటీవలీ కాలంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది.

    Also Read: ‘రైతుబంధు’ కోసం ఎదురుచూపులేనా?

    ప్రజలంతా భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం.. శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటివి చేస్తున్నారు. దీనికితోడు కరోనా టెస్టుల కోసం వినియోగించే వైద్య పరికరాలు ఇప్పుడు స్వదేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి.

    తొలినాళ్లతో కరోనా టెస్టులు చేసేందుకు ఆస్పత్రుత్లో బిల్లులు వసూలు చేసేవాళ్లు. దీంతో ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా టెస్టులకు అనుమతి ఇచ్చాయి. అయితే కరోనా కరోనా పెరిగిపోవడంతో ప్రయివేట్ లోనూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

    తెలంగాణలో ప్రవేట్ ఆస్పత్రుల్లో గరిష్ట ధరను రూ. 2,250కు మించవద్దని సీలింగ్ విధించింది. అయితే అనధికారికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగానే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

    Also Read: మూడు రాజధానులు: జగన్‌కు మోడీ సాయం చేస్తున్నారా?

    ఇదిలా ఉంటే కొద్దిరోజుగా కరోనాకు సంబంధించి వైద్య పరికాలు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా టెస్టులను రూ.499కే ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది.

    తెలంగాణలోనూ కరోనా టెస్టు ధరను రూ.499కే ఖరారు చేయాలని వైద్యా ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రూ.850కు మించి ఆర్-పీసీఆర్ టెస్టులకు వసూలు చేయద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో వారంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్