https://oktelugu.com/

ప్రధాన ప్రతిపక్షం సైలెన్స్.. ఏపీలో ఇదే చర్చ..!

ఏపీలో ఎక్కడ చూసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గురించి చర్చ నడుస్తోంది. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడాల్సిన టీడీపీ కొద్దిరోజులుగా ఆ విషయాన్నే పక్కన పెట్టిందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఒకటి అర మినహా దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు ఎక్కడా యాక్టివ్ గా కన్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల సడన్ సైలంట్ వెనుక కారణాలపైనే ప్రజల్లో విస్కృతంగా చర్చ నడుస్తోంది. Also Read: పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్? టీడీపీ అధినేత చంద్రబాబు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 01:48 PM IST
    Follow us on


    ఏపీలో ఎక్కడ చూసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గురించి చర్చ నడుస్తోంది. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడాల్సిన టీడీపీ కొద్దిరోజులుగా ఆ విషయాన్నే పక్కన పెట్టిందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఒకటి అర మినహా దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు ఎక్కడా యాక్టివ్ గా కన్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల సడన్ సైలంట్ వెనుక కారణాలపైనే ప్రజల్లో విస్కృతంగా చర్చ నడుస్తోంది.

    Also Read: పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్?

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం టీడీపీ నేతలపై నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో అంతగా యాక్టివ్ గా పనిచేయని నేతల నివేదికను ఇప్పటికే బాబు తెప్పించుకున్నారని తెలుస్తోంది. వీరిందరి పనితీరు, గ్రాఫ్ బాబుకు పెద్దగా నచ్చడంలేదని టాక్ విన్పిస్తుంది. వీరిలో ఎక్కువగా గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారే ఉన్నట్లు సమాచారం. టీడీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందనే ఆశతో వైసీపీ జెండాను పీకేసీ పచ్చకండువా కప్పుకున్నారు. అయితే వీరి ఆశలన్నీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు వొమ్ము చేశారు. ప్రస్తుతం వారంతా టీడీపీలో కొనసాగుతోన్న వారి మనస్సు మాత్రం వైసీపీ వైపు లాగుతుండటంతో నేతలు సైలంట్ అయినట్లు తెలుస్తోంది.

    గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారంతా మళ్లీ అధికార పార్టీవైపు చూస్తున్నారు. అయితే వైసీపీలో ఇప్పటికే నేతల తాకిడి ఎక్కువగా ఉండటంతో సీఎం జగన్ తలుపులు మూసేశారు. దీంతో చేసేదిలేక టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే అవకాశం వస్తే చంద్రబాబుకు హ్యండిచ్చి అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తూ టీడీపీ నేతలను జైళ్లకు పంపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లంతా ఎందుకైనా మంచిదని కొంత దూకుడును తగ్గించినట్లు తెలుస్తోంది.

    Also Read: ఢిల్లీలో విజయసాయి దుకాణం బంద్?

    దీంతోనే టీడీపీ నేతలు ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ ఉండటం లేదని తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలంతా ఎప్పుడెప్పుడు అధికారం పార్టీలోకి వెళుదామా? అని కాచుకుని కూర్చున్నారట. అయితే వీరు యాక్టివ్ గా లేరనే సాకుతో చంద్రబాబునాయుడు వీరిని పక్కకు పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో కిందిస్థాయి నాయకులు తమకు పదవుల్లేకుండా తామేందుకు కార్యక్రమాలు చేయాలని ఊరుకుంటున్నారట. దీంతో టీడీపీ పరిస్థితి రెంటికి చెడ్డ రెవడీగా మారిపోయింది. టీడీపీ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల వరకు కూడా పార్టీ కోలుకోవడం కష్టమేననే వాదన విన్పిస్తుంది. నేతల సైలంట్ ను చంద్రబాబు ఎలా బ్రేక్ చేస్తారో వేచి చూడాల్సిందే..!