https://oktelugu.com/

ఆ ముక్క ముందు మోడీని కదా అడగాల్సింది బాబు..!

సోషల్ మీడియా వేదికగా నేడు ప్రతిపక్షం చేసిన రాద్ధాంతం ఏమిటంటే జగన్ పెట్రోల్, మరియు డీజిల్ పై స్టేట్ వ్యాట్ పెంచేశారు. నమ్మి ఓటు వేసినందుకు వాతలు, కోతలు పెడుతున్నారు. ఒక చేత్తో పంచుతూ… మరో చేత్తో రెండింతలు లాక్కోవడం జగన్ కి బాగా తెలిసిన విద్య. ఇవి సోషల్ మీడియా వేదికగా జగన్ పై టీడీపీ నేతల ఆరోపణలు. ఇక టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లైవ్ లోకి వచ్చి ఏకి పారేశారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 12:53 PM IST
    Follow us on


    సోషల్ మీడియా వేదికగా నేడు ప్రతిపక్షం చేసిన రాద్ధాంతం ఏమిటంటే జగన్ పెట్రోల్, మరియు డీజిల్ పై స్టేట్ వ్యాట్ పెంచేశారు. నమ్మి ఓటు వేసినందుకు వాతలు, కోతలు పెడుతున్నారు. ఒక చేత్తో పంచుతూ… మరో చేత్తో రెండింతలు లాక్కోవడం జగన్ కి బాగా తెలిసిన విద్య. ఇవి సోషల్ మీడియా వేదికగా జగన్ పై టీడీపీ నేతల ఆరోపణలు. ఇక టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లైవ్ లోకి వచ్చి ఏకి పారేశారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచడం అంటే, పేదవాళ్లపై పెనుభారం మోపినట్లే అన్నారు. రవాణా ఖర్చులు పెరిగి ఆభారం నిత్యావసర ధరలపై పడుతుంది అనేది ఆయన ఆరోపణ. ఆర్థిక సూత్రాల ప్రకారం ఆయన చెప్పిన దానిలో నిజం ఉంది. మరి రాష్ట్ర ఆర్థిక అవసరాల మాటేమిటీ? కరోనా వైరస్ వలన రాష్ట్రానికి వచ్చే అత్తెసరు ఆదాయం అడుగంటి పోగా, ఆదాయ మార్గాల సంగతేమి అనేది ఒక ప్రశ్న.

    Also Read: ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?

    ఇక ఏపీలో పెట్రోల్ పై రూ. 1.24, డీజిల్ పై రూ.0.93 పెంచడం జరిగింది. ఈ విషయంలో మొదట టీడీపీ ప్రశ్నిచాల్సింది కేంద్రాన్ని. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెంచుతున్నారని బాబు కానీ ఆయన నేతలు కానీ బీజేపీని పల్లెత్తి మాటన్న పాపాన పోలేదు. మరి టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకొనే చంద్రబాబుకు మరియు టీడీపీ నేతలకు ఇది ఎందుకు కనిపించదు. ఎన్నికలకు ముందు మోడీపై తొడలు కొట్టిన టీడీపీ నేతలు ఎందుకు కిక్కురు మనడం లేదు అంటే…అంతా చంద్రబాబు ట్రైనింగే. ఎలాగైనా బీజేపీ పంచన చేరి, జగన్ అరెస్టుల దాడిని నుండి భయటపడాలనేది చంద్రబాబు ఆలోచన. రోజుల వ్యవధిలో దాదాపు రూ. 10 పెంచిన కేంద్రాన్ని వదిలేసి, రూపాయి పెంచిన వైసీపీని టార్గెట్ చేయడం వింతగా తోస్తుంది.

    Also Read: జగన్ దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమేనా ఇది?

    ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం మెచ్యూరిటీగా వ్యవహరించారు అనిపిస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ పై ఏపీ స్టేట్ టాక్స్ పెంచిన అంశాన్ని ఆయన విమర్శించలేదు. దానికి కారణం, జగన్ ని ప్రశ్నించే ముందు ఆయన పెట్రోలు ధరలపై బీజేపీని నిలదీయాల్సివస్తుంది. బీజేపీతో మిత్ర పక్షముగా ఉన్నందున ఆయనకు ఇంకా ఎక్కువ భాద్యత ఉంది. దానితో ఏపీ ప్రభుత్వంపెంచిన వ్యాట్ గురించి ఆరోపణలు చేస్తే బీజేపీ అడ్డగోలుగా పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆయన గమ్మున ఉన్నాడు. మరి ఈ విషయంలో పవన్ కి ఉన్న పరిజ్ఞానం కూడా బాబుకు లేకుండా పోయింది.