
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే రాజకీయ నాయకుడు. అతి తక్కువ టైమ్‌లోనే జగన్ ఆ పరిణతి సాధించింరనే చెప్పాలి. ప్రతిపక్షాల విమర్శలు.. ధాటిని ఎలా తట్టుకోవాలో.. వాటికి ఎలా బదులివ్వాలే జగన్‌కు బాగా తెలుసు. వారి విమర్శలకు ఎలా చెక్ పెట్టాలో కూడా తెలుసుకున్నారు. ఏపీలో రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు. రోజుకో రచ్చ చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. టీడీపీ అయితే ఏకంగా 2019లో వైసీపీకి ఆయాచితంగా వచ్చిన అధికారమంటూ ఎద్దేవా చేస్తుంటుంది. జగన్‌ది గాలివాటం గెలుపంటూ చెబుతుంటుంది. అయితే.. ఇప్పుడు ఆ విమర్శలను తిప్పికొట్టడానికి జగన్‌కు ఈ తిరుపతి సీటు ఛాలెంజ్‌గా మారనుంది.
Also Read: మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్న బీజేపీ..!
తిరుపతి లోక్‌సభ సీటు వైసీపీదే. అది ఇప్పుడైనా.. ఎప్పుడైనా.. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఏడింట మూడు అసెంబ్లీ సీట్లు ఎస్సీల పాపులేషన్ అధికంగా కలిగినవే. ఇక్కడ ఎప్పుడూ వైసీపీదే పై చేయి. మిగిలిన చోట్ల కూడా అధికార పార్టీకి ఎంతైనా అనుకూలత ఉంటుంది. ఇక బీజేపీ, టీడీపీ ట్రాక్ రికార్డు చూసినా వారికి గెలిచేటంత సీన్ లేదు. దాంతో జగన్ తిరుపతి ఉప ఎన్నికల మీదనే పూర్తి దృష్టి పెట్టి ఉంచారని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న విగ్రహాల విధ్వంసం ఘటనకు కానీ.. ఇతర అనేక విషయాలు కానీ.. మొత్తం ఒకే ఒక్క జవాబు తిరుపతి ఎన్నికల ఫలితం. అందుకే.. దీనిని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ఈఏడాది మార్చి రెండో వారంలో జరగాల్సి ఉంది. దాంతో నోటిఫికేషన్ వచ్చాక టీడీపీ దూకుడు మరింతగా పెంచుతుందని, ఏపీలో మత రాజకీయాలు మరింతగా ముదిరి పాకాన పడతాయని కూడా అధికార పార్టీ అంచనా వేసింది. అయితే.. ఏపీలో ఇలాంటివి ఎన్ని జరిగినా జనాలు మాత్రం మత రాజకీయాల వైపు అసలు మొగ్గు చూపరనేది కూడా టాక్. ఆ నిజాన్ని తిరుపతి ఉప ఎన్నిక రుజువు చేస్తుందని కూడా వైసీపీ నేతలు నమ్ముతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ విజయం ఖాయమని కూడా వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ.. చంద్రబాబు మౌనం వెనక అంతర్యం ఏమిటీ..?
ఇక ఏపీలో అసలైన సినిమా కూడా తిరుపతి ఉప ఎన్నికల తరువాతనే ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు 2019 తరువాత మరో ఓటమి కూడా తిరుపతి రూపంలో ఎదురైతే అది ఆ పార్టీకి అశనిపాతమేనని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ ఓడిన రెండేళ్ల తరువాత కూడా ఇంకా అలాంటి పరిస్థితే ఉంటే సైకిల్ దిగిపోయే వారి జాబితా ఒక్కసారిగా పెరుగుతుందనే గాసిప్స్ సైతం వినిపిస్తున్నాయి. అపుడు అనువుగా ఉన్న వైసీపీలో కానీ బీజేపీలో కానీ చేరేందుకు నేతలు క్యూ కడతారని అంటున్నారు. ఏపీలో టీడీపీ అలా బలహీనపడే పరిస్థితే వస్తే జగన్ ఈసారి ఏ మాత్రం ఉపేక్షించరని వచ్చిన వారిని వచ్చినట్లే పార్టీలో చేర్చుకుంటారని కూడా చెబుతున్నారు. మొత్తానికి మరో రెండున్నర నెలల్లో జరగబోతున్న తిరుపతి బై పోల్ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించబోతాయనేది వాస్తవం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్