Revanth Reddy: కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికొస్తుందా? పార్టీని ముందుకు నడిపించే వారిపై విమర్శలు ఎక్కువగా వస్తాయి. దీంతో వాటిని తట్టుకుని మరీ పార్టీని గాడిలో పెట్టడం అంటే మాటలు కాదు. దానికి చాలా శక్తి కావాలి. సముద్రమటువంటి పార్టీ ప్రస్తుతం కష్టాలు పడుతోంది. పార్టీలో సీనియర్ పెత్తనం పెరిగిపోతోంది. ఫలితంగా ఏ పని చేయాలన్నా వారి ఆమోదం తప్పనిసరి. వారికి చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే దగ్గర దారిలో వెళదామంటే వారు ఒప్పుకోరు. దీంతో పార్టీ భవితవ్యం కాస్త వెనుకంజలో పడిపోతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత అసలు పార్టీ ఉందా అనే అనుమానాలే అందరిలో వస్తున్నాయి.

ఏదో రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ పరిస్థితి మారిపోతోందని అందరు అనుకున్నారు. కానీ ఆయన వచ్చిన తరువాత ఇంకా నిశ్శబ్దంగా మారిపోయింది. పార్టీని గురించి ఆలోచించే వారి సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. ఫలితంగా ప్రజల్లో కాంగ్రెస్ ఉందనే అభిప్రాయమే కనిపించడం లేదు. ఈనేపథ్యంలో పార్టీ భవితవ్యం అంధకారంలో పడింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉంటుందనే వాదన రావడం లేదు.
Also Read: మహేష్ నిర్మాణంలో వస్తున్న ‘మేజర్’ వాయిదా !
గతంలో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలో నిలబెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన శైలిలో నడిపించారు. అసమ్మతి ఉన్నా అందరి సమ్మతితోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు నడిపించారు. కానీ ప్రస్తుతం ఉన్న నేతల్లో సమన్వయం కొరవడింది. కొట్టుకు చావడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా పార్టీ గందరగోళంలో పడిపోతోంది.

రాజకీయాల్లో వ్యూహాలు అమలు చేయాలి. వైఖరులు అవలంభించాలి. దీంతో అసమ్మతి కూడా సమ్మతిగా మారిపోతోంది. కానీ ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇది తెలియడం లేదు. దీంతో ఆయన పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ప్రస్తుతం పార్టీ పీకల్లోతు కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క సీనియర్లు, మరోవైపు అధిష్టానం రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
దీంతో పార్టీ భవిష్యత్ ఎటూ తేలడం లేదు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గాడిలో పెట్టకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి పార్టీని నడిపించడానికి వైఎస్ ఫార్ములాను అనుసరిస్తున్నట్లు తెలుస్తున్నా ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? లేక వెనుకే ఉండిపోతోందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: గల్ఫ్ దేశాలపై క్షిపణలు, బాంబు దాడులు.. మళ్లీ పెట్రోల్ డీజీల్ పైపైకేనా?