Homeజాతీయ వార్తలుDalit CM: దళిత సీఎం.. రేవంత్ కు సీఎం సీటు దక్కుతుందా?

Dalit CM: దళిత సీఎం.. రేవంత్ కు సీఎం సీటు దక్కుతుందా?

Revanth reddy as CM candidateDalit CM: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో జోష్ పెరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యతలు స్వీకరించాక పార్టీలో కదలిక పెరుగుతోంది. టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ 72 సీట్లు దక్కించుకోవడం ఖాయమని ప్రకటిస్తున్న నేపథ్యంలో నేతల్లో దూకుడు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధ్యమేనని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) ఓ కీలక వ్యాఖ్య చేసి సంచలనం రేపుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అవుతారని బాంబు పేల్చి రేవంత్ ఆశలపై నీళ్లు చల్లారు.

భవిష్యత్ సీఎం రేవంత్ రెడ్డి అని తెలిసిన క్రమంలో కోమటిరెడ్డి ప్రకటన అందరిలో ఆసక్తి కలుగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి వారి ఓట్లు కొల్లగొట్టనున్న సందర్భాన్ని పురస్కరించుకుని కోమటిరెడ్డి ప్రకటన అందరిలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడిని చేస్తానని మాట ఇచ్చిన సీఎం కేసీఆర్ తరువాత మాట మార్చారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. దీంతో కోమటిరెడ్డి దళితుడే సీఎం అన్న మాట అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తోంది.

సమయం కోసం చూస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళితుడే సీఎం అని చెబుతున్న క్రమంలో రేవంత్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. రేవంత్ రెడ్డి అవకాశాలను దెబ్బ కొట్టేందుకే వెంకటరెడ్డి ఈ మేరకు దళిత సీఎం విషయం వెలుగులోకి తెచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ ప్రకటనకు మొగ్గు చూపితే రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రేవంత్ శ్రమతో అధికారంలోకి వచ్చినా సీఎం పీఠం మాత్రం దళితుడికి ఇవ్వాలంటే కొంత కష్టమేనని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఎంత మేరకు ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిదే. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తారు. దీంతో దళితుడే సీఎం అనే ధోరణి నేతల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి శ్రమకు ఫలితం వచ్చినా అది ఎవరికి చేరుతుందో అనే ప్రశ్నే వెలువడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో విచిత్రకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఎంత మేర ఫలితాలు సాధిస్తుందో అని నాయకుల్లో ఆసక్తి కలుగుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version