
ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. 7 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని చిలకలగూడ పోలీసులు కోర్టును కోరారు. కాగా, తీన్మార్ మల్లన్న తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తయ్యాయి.