CM Jagan- MLAs: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు మనవే. కుప్పంలో చంద్రబాబును సైతం ఓడించబోతున్నాం. మొన్నటివరకూ ఏపీ సీఎం జగన్ చెబుతున్న మాటలివి. అయితే ఇవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే సీఎం వద్ద అనేక నివేదికలు ఉన్నాయి. చాలా మంది మంత్రులు, తాజా మాజీ మంత్రులు ఎదురీదుతున్నారన్న నివేదికలు సీఎం టేబుల్ పైకి చేరాయి. కానీ సీఎం జగన్ మాత్రం ఏపీలో అన్ని స్థానాలు గెలుపొంది క్లీన్ స్వీప్ చేసేద్దామన్న రీతిలో వైసీపీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. అయితే అటు సొంత పార్టీ శ్రేణుల్లో సైతం ఇది నమ్మశక్యం కావడం లేదు. గత ఎన్నికల్లో అయితే ఒక చాన్స్ అనే మాట పనిచేసిందని.. ఇప్పుడు మాత్రం అటువంటి మంత్రదండం ఏదీ తమ వద్ద లేదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అటువంటప్పుడు సంపూర్ణ విజయం ఏమిటని సొంత పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.

అయితే తాజాగా సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ తో తత్వం బోధపడింది. 27 మంది ఎమ్మెల్యేల పూర్ ఫెర్ ఫర్మాన్స్ తో వెనుకబడి ఉన్నారని సీఎం జగన్ ప్రకటించారట. అయితే ఇందులో సీఎం జగన్ సన్నిహితులే అధికమట. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరావు వంటి కీలక నేతలే ఈ జాబితాలో ఉండడం విశేషం. అయితే సర్వే నివేదికలు వచ్చిన తరువాత సీఎం జగన్ కూడా అవాక్కయ్యారట.
Also Read: Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామా అస్త్రం.. పొలిటికల్ సర్కిల్ లో సంచలనం
ఎందుకంటే వీరంతా విపక్షాలపై, ప్రధానంగాచంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన వారేనట. అయితే వీరి పరిస్థితి ఏమంతా బాగాలేదని తెలుస్తోంది. వీరు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరించినట్టు నిఘా వర్గాలు సీఎంకు చేరవేశాయి. ముఖ్యంగా పార్టీకి మైలేజ్ గా నిలిచే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖం చాటేసినట్టు సీఎంకు సమాచారం ఉంది. అయితే వర్క్ షాపు వరకూ తమ పేర్లు ఉంటాయని భావించిన చాలా మంది ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారుట. ఎందుకంటే తమ కంటే మంత్రులు, తాజా మాజీ మంత్రులు వెనుకబడి ఉన్నారని తెలుసుకొని ఉపశమనం పొందారుట. అయితే వర్క్ షాపులో వెనుకబడిన 27 మంది జాబితాను సీఎం జగన్ ప్రకటించిన మీడియాకు లీకు చేయవద్దని అధిష్టాన పెద్దలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది.

అయితే సమావేశం సీరియస్ గా జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. నవంబరు వరకూ కొంతమంది నేతలకు చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు మీపై ప్రేమ ఉన్నా గ్రాఫ్ బాగాలేనిదే ఏమీ చేయలేనని జగన్ తేల్చిచెప్పినట్టు సమాచారం. నవంబర్ వరకూ చాన్స్ ఇస్తున్నానని.. ప్రూవ్ చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. తరువాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడ్ని చేయవద్దని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఇది కొంతమంది వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. కొడాలి నాని వంటి వారికి అసలు రుచించడం లేదుట. జగన్ కోసం సొంత సామాజికవర్గానికి దూరమైతే..ఇప్పుడు నా పేరు ఉన్న పలంగా బయటపెట్టడమేమిటని ఆయన తెగ బాధపడిపోతున్నట్టు తెలిసింది. అందుకే కృష్ణా జిల్లా సమన్వయ సమావేశానికి దూరమైనట్టు సమాచారం. అయితే 27 మంది జాబితాను బయటపెట్టారని.. సీఎం జగన్ కు కావాల్సిన వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Also Read: Pre- Wedding Shoot In Grave: నీ దుంపతెగ.. ఇదేం పోయేకాలం.. సమాధిలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంట్రా బాబూ
[…] […]