అంతా అనుకున్నట్లే జరిగింది. ఇప్పటికే ఏపీలో బీజేపీతో అంటకాగుతున్న జనసేన.. తెలంగాణలోనూ గ్రేటర్ బరిలో బీజేపీకి మద్దతు తెలిపింది. గ్రేటర్‌లో తన బలం చాటుకునే అవకాశం ఉన్నా.. పవన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించేశారు. గ్రేటర్‌లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని.. వచ్చి అడగగానే పోటీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు జనసైనికుల చూపు.. తిరుపతి వైపు పడింది. తిరుపతిలోనూ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ త్యాగం చేసేస్తారేమోనని కంగారు పడుతున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా తామే పోటీ చేస్తామన్నట్లుగా సమాచారాన్ని లీక్ చేస్తున్నారు.
Also Read: జనసేన సైడ్ అవ్వడం.. జనసేనానికే లాభం?
పవన్‌కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. కానీ.. సొంత పార్టీ కన్నా ఆయన బీజేపీ మీదనే ఎక్కువ మక్కువ పెంచుకుంటున్నారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి స్థానానికి ఉపఎన్నిక ఖాయమని.. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించిన రోజే అందరికీ తెలుసు. అన్నిపార్టీలు ఇందుకోసం అంతర్గతంగా కసరత్తు చేశాయి. టీడీపీ అధినేత అభ్యర్థిని ఖరారు చేసేశారు. తాము మాత్రం ఎందుకు వెనుకబడటం అని వైసీపీ అధినేత జగన్ కూడా అభ్యర్థిని ఖరారు చేశారు.
ఇక అందరి చూపు బీజేపీ–-జనసేన వైపు పడింది. ఆ కూటమి తరపున ఎవరు పోటీచేస్తారు. అభ్యర్థి ఎవరవుతారన్న దానిపై చర్చ ప్రారంభమైంది. బీజేపీతో పోలిస్తే.. జనసేనకు అక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి పదహారు వేల ఓట్లు మాత్రమే సాధించింది. జనసేన పొత్తులో భాగంగా బీఎస్పీకి అప్పగించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందన్న ప్రజల అభిప్రాయంలో మార్పు రాకపోగా.. మరింతగా ఇబ్బంది పెడుతోందన్న అభిప్రాయం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ పోటీ చేయడం కన్నా జనసేన పోటీ చేయడం బెటరన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. అయితే.. ఇదే ఫీలింగ్ జనసేనలో మాత్రం కలుగుతుందా.. పవన్ కల్యాణ్‌లో రగులుతుందా.. అన్నది మాత్రం సందేహాస్పదంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
గ్రేటర్‌లో పోటీ చేస్తామని అధినేత పవన్ ప్రకటించడంతో జన సైనికులు ఆనందంలో మునిగిపోయారు. కానీ.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం నిరాశకు గురయ్యారు. పవన్ కల్యాణ్ పిడికిలి n b bv 000000;;n;l; p9 m,\బిగించి యుద్ధం చేస్తామని ప్రకటిస్తారు.. ఆ ఆవేశం నచ్చిన ఫ్యాన్స్ .. తాము కూడా ఆవేశ;పడ్డారు. చివరికి వచ్చే సరికి పవన్ కల్యామ్ యుద్ధ బరిలోకి దిగడంలేదు. ఇప్పటికే చాలా సా’ర్లు అలా0
]జరిగింది. దీంతో పవన్ కల్యాణ్ మీద కార్యకర్తలకు, అభిమానులకు నమ్మకం పోతోందట.