
వరదసాయం ఆపేయాలని ఈసీకి నేను రాయలేదని ఇప్పటికే చెబుతున్నానని బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద సాయంపై నా సంతకం ఫోర్జరీ చేసి లెటర్ పంపించారన్నారు. నిన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు పిలిస్తే ఎందుకు రాలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. అయితే పక్కనున్న మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి వచ్చినా బాగుండేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము గెలిస్తే వదరసాయం రూ.20 వేలు ఇస్తామ న్నారు. టీఆర్ఎస్ కు 25 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఉన్నవాళ్లను కాపాడుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ మెనీఫెస్టోను త్వరలోనే కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ విడుదల చేస్తారని అన్నారు.