పూరి జగన్మాథ్ కు సినిమా ఇండస్ట్రీలో డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. ఉన్నది ఉన్నట్లుగా.. విషయాన్ని సాగదీయకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.. ఆ మాటలతో అందరినీ మెప్పించడం పూరి స్టైల్. సినిమాలతో ఫుల్ బీజీగా ఉండే పూరి జగన్మాథ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు.
Also Read: బిగ్ బాస్-4: కెప్టెన్ గా ఎంపికైన హరిక.. అఖిల్.. మొనాల్.. సొహెల్ కు దెబ్బ..!
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్మాథ్ కొద్దిరోజులుగా ఆసక్తికరమైన విషయాలపై వాయిస్ మేసేజ్ లు పెడుతున్నారు. సమాజంలోని వివిధ సమస్యలపై తనదైన విశ్లేషణ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా ఆదివారం నాడు అవధానం గురించి తనదైన శైలిలో పూరి వివరించాడు.
భారతదేశంలో పురాతన కాలం నుంచి ఓ సాహిత్య ప్రదర్శన ఉండేదని.. దాని పేరు అవధానం అని చెప్పారు. దీని గురించి నేటి తరం పిల్లలకు పెద్దగా తెలియకపోచ్చన్నారు. ఇది సంస్కృతం భాష నుంచి వచ్చిందని అవధానం చేయాలంటే మహాజ్ఞాని అయి ఉండాలని తెలిపారు.
కవితలు.. సృజనాత్మకత.. మేధస్సు.. జ్ఞాపకశక్తి.. సంగీతం.. లెక్కలు.. హస్యచతురత.. ఇలా ఎన్నో లక్షణాలు ఉండాలన్నారు. వెయ్యి మంది అడిగే ప్రశ్నలకు పద్యరూపంలో సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఇవన్నీ కూడా చందస్సులో ఉండేలా చూసుకోవాలన్నారు. మధ్యలో చాలామంది వీరిని డిస్టబ్ చేసేందుకు యత్నిస్తుంటారని తెలిపారు.
Also Read: వినాయక్ ను చిరు సైడ్ చేస్తున్నాడా? నిజమెంత..!
ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడ లేదని.. కేవలం భారతీయులు మాత్రమే ఇలాంటివి చేయగలరని స్పష్టం చేశారు. ఇప్పుడున్న వారిలో మేడసాని మోహన్ పంచసహస్త్రావధానం చేశారని.. గరికపాటి నరసింహరావు.. రాళ్లబండి కవితా ప్రసాద్.. మాడుగుల నాగఫణిశర్మ తదితరులు ఎంతోమంది అవధానం చేశారని తెలిపారు.
తాను గరికపాటి గారి వీడియోలు చూస్తుంటానని తెలిపారు. ఆయన గొప్పగొప్ప విషయాలు కూడా నవ్వుతూ సరదాగా చెబుతుంటారని తెలిపారు. వాటిని అందరూ జోక్స్ అనుకుంటారని ఆయన మనల్నే తిడుతారనేది పట్టించుకోకరంటూ సెటైర్ వేశారు. వీలుంటే సహస్త్రావధానం వీడియో ఒకసారి చూడండి అంటూ కోరాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సరస్వతిదేవి లాలించిన పిల్లలే ఈ అవధానం చేయగలరని స్పష్టం చేశాడు.