ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ ఓ సంచలనం. పార్టీ పెట్టిన పదేళ్లలో ఎవరి సపోర్ట్ లేకుండా సీఎం పీఠం ఎక్కడం అనేది ఎవరికైనా కత్తిమీద సామే. ఏళ్లుగా సీఎం కావాలని ఆశపడి వయసుడిగిపోయి ఆశలు వదిలేసిన నేతలు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ అదిష్టానాన్ని ఎదరిస్తే ఎదురయ్యే పర్యవసానాలు జగన్ కి బాగా తెలుసు , అయినా ప్రజల తోడు ఉంటుందనే నమ్మకంతో సునామీకి ఎదురెళ్లాడు. దాని ఫలితమే అరెస్టు, 16 నెలల జైలు జీవితం. మరొకడైతే అప్పుడే కాంగ్రెస్ తో కాంప్రమైజై ఇచ్చినది పుచ్చుకొని గమ్మున ఉండేవాడు. జగన్ తత్త్వం చాలా భిన్నం. పదేళ్లు పట్టుదల, మొండితనం జగన్ కి ఆ అధికారం దక్కేలా చేసింది. మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్లిన జగన్ సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి వాళ్లకు బాగా దగ్గరయ్యాడు. జనం నమ్మి ఓట్లు వేసినందుకు ఏడాది తిరిగేలోపే…ఇచ్చిన హామీలు 90 శాతానికి పైగా పూర్తి చేశారు. జగన్ సక్సెస్ ని చూసి కుళ్ళుకునే వాళ్లు, అసాధ్యం సుసాధ్యం చేశాడని మనసులో మెచ్చుకొనే ప్రత్యర్ధులు ఎందరో ఉన్నారు.
Also Read: చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?
దీనితో టీడీపీ నేతలకు విమర్శించడానికి జగన్ ఏమి మిగల్చలేదు. అందుకే ఎప్పటిలాగే జగన్ అవినీతి పరుడు, వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేయడంతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ముఖ్యంగా టీడీపీ ఫ్యూచర్ గా బాబు భావిస్తున్న నారా లోకేష్, ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతుంటాడు. ఆయన సోషల్ మీడియాలో జగన్ పై చేసే వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి. లోకేష్ అంటే రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో అందరికీ తెలుసు. చంద్రబాబుకు కూడా లోకేష్ సమర్ధత బాగా తెలుసు కాబట్టే…ఎమ్ ఎల్ సి కట్టబెట్టి ఆపై మంత్రిని చేశారు. మంత్రి గారు మైకు ముందుకు వస్తే చాలు, సుగుణాలన్నీ బయటపడేవి. ఐదేళ్ల అనుకూల మీడియా ఎంత లేపినా ఇంచు కూడా ప్రజల్లో నాయకుడిగా నిరూపించుకోలేక పోయాడు. అంత పెద్ద పార్టీ అండ, అనుకూల ఓటు బ్యాంకింగ్ ఉన్న చోట కూడా ఓటమి చెంది , అబాసుపాలయ్యాడు.
Also Read: సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?
ఇక బాబు సైతం లోకేష్ రాజకీయ అరంగేట్రమే దొడ్డిదారిన చేశాడు. ఎమ్ ఎల్ సి ని చేయకుండా, టీడీపీ ఖచ్చితంగా గెలిచే ఓ నియోజకవర్గంలో నిలబెట్టి గెలిపించి, ఆపై మంత్రిని చేయాల్సింది. అలా కాకుండా ఎమ్ ఎల్ సి ద్వారా మంత్రిని చేశారు. దీనితో బాబుకే అబ్బాయి లోకేష్ పై నమ్మక లేదని ప్రజలకు అర్థం అయ్యింది. మరి వచ్చే నాలుగేళ్ళకైనా జగన్ కి ధీటుగా లోకేష్ ఎదుగుతాడు అనుకుంటే…ఆయన రాజకీయం అంతా ట్విట్టర్ కే పరిమితం అవుతుంది.ఒక్కసారి కూడా ఓ విషయంపై టీవీ డిబేట్ లో పాల్గొన్న దాఖలాలు లేవు. నిన్ను జనాలు నమ్మాలి అంటే విషయ అవగాహన, పోరాట తత్త్వం ఉందని వారికి తెలియాలి. జనాల్లోకి రాకుండా, ఇలా ట్వీట్స్ వేసుకుంటూ కూర్చుంటే… ఆయనపై జనానికి నమ్మకం కలిగేదేప్పుడు.ట్వీట్స్ కి ఓట్లు రాలవని, ఆయనకు ఎవరైనా చెబితే బాగుండు.