గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు రూపొందించిన రెండు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లులపై గవర్నర్ సంతకం చేస్తే అమరావతిలో రాజధానిని విశాఖకు తరలింపు ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. గవర్నర్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరాయని తెలియగానే రాష్ట్ర విపక్ష పార్టీలు స్పందించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు […]

Written By: Neelambaram, Updated On : July 19, 2020 11:58 am
Follow us on


మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు రూపొందించిన రెండు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లులపై గవర్నర్ సంతకం చేస్తే అమరావతిలో రాజధానిని విశాఖకు తరలింపు ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. గవర్నర్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరాయని తెలియగానే రాష్ట్ర విపక్ష పార్టీలు స్పందించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు లేఖలు రాశాయి. హరిచందన్ బిజెపి నాయకులు ఆయనను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏపీకి గవర్నర్ గా నియమించింది.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి శాసన మండలి ప్రతిపక్షనాయకులు యనమల రామకృష్ణుడు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్ కు లేఖ రాశారు. ప్రజాప్రయోజనాల దృష్టితో పరిశీలించాలని కోరారు. భారత అటార్నీ జనరల్ అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి బిల్లులు పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గవర్నర్ సోంత పార్టీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానులు రాష్ట్ర పునర్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని, శాసన మండలిలో సెలక్ట్ కమిటీ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నందున ఈ రెండు బిల్లులను ఆమోదించవద్దని తాను రాసిన లేఖలో గవర్నర్ ను కోరారు. మూడు రాజధానులు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు ఆటంకంగా మారతాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.9,600 కోెట్లు ఖర్చు చేసి అభివృద్ది భవన నిర్మాణాలు, రోడ్లు నిర్మించారని సీసీఐ కార్యదర్శి కె.రామకృష్ణ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతులు 214 రోజుగా ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించవద్దని కోరారు.

Also Read: గవర్నర్ వద్దకు చేరిన బిల్లుల పంచాయతీ..

గవర్నర్ బాధ్యతులు చేపట్టిన అనంతరం ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, సీపీఐ, సీపీఎం, బిజెపి, జనసేన పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ బీజేపీ నాయకులు గవర్నర్ తీరును తప్పుబట్టారు. న్యాయపోరాటంలో గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ నిలువ లేదు. హైకోర్టు ఆ ఆర్డినెన్స్ ను కోట్టివేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా హై కోర్టు తీర్పునే సుప్రీం కోర్టు సమర్ధించింది.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాష్ట్ర ఎన్నిక కమిషనర్ గా రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం గవర్నర్ ను కలవనున్నారు. తనను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని కోరనున్నారు. ఇప్పటి వరకూ గవర్నర్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకున్నారు. ఈ రెండు అంశాలపై గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా లేక వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారా అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు తనను గవర్నర్ గా నియమించిన సొంత పార్టీ, విపక్షాలు.. మరి గవర్నర్ ఏ వైపు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
Also Read: నర్సాపురం ఎంపీ బరిలో సినీ నటుడు